సమ్మర్ డ్రింక్.. పుచ్చకాయ జ్యూస్.. ఇదొక్కటి యాడ్ చేసుకుంటే..
పుచ్చకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అందువల్ల సమ్మర్ లో మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇది అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే పుచ్చకాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సాయపడుతుంది. ఇక పుచ్చకాయను డెయిలీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.. రక్తపోటును అదుపులో ఉంచడానికి దోహదం చేస్తుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గిస్తుంది.
అయితే పుచ్చకాయను చాలా మంది కట్ చేసుకుని డైరెక్ట్ గా తింటారు. ఇంకొంతమంది మెత్తగా జ్యూస్ చేసుకుని తాగుతారు. అయితే సమ్మర్ లో సూపర్ టేస్టీ పుచ్చకాయ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు.. ? పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానం చూస్తే..? పుచ్చకాయ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పుచ్చకాయ ముక్కలు 3 పెద్ద కప్పులు, కొబ్బరి నీళ్లు 300ఎంఎల్, పంచదార 2 టీస్పూన్ లు, ఐస్ క్యూబ్స్ అర కప్పు తీసుకోవాలి.

పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానం చూస్తే.. తాజా పుచ్చకాయను తీసుకొని కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటి తొక్కలను తీసేసి గింజలను కూడా తీసేయాలి. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలుగా 3 కప్పుల పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని కట్ చేసి పెట్టుకున్న పుచ్చ ముక్కలను వేయాలి. ఇప్పుడు అందులో కొబ్బరి నీళ్లు, చక్కెర, ఐస్ ముక్కలు వేసి యాడ్ చేసుకోవాలి. అలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే సూపర్ టేస్టీ పుచ్చకాయ జ్యూస్ రెడీ అయినట్టే.. అయితే ఇందులో కొబ్బరి నీళ్లు వేసుకుంటే ఆ టేస్టే వేరు..
-
విజయవాడ స్పెషల్ 'పునుగులు'.. ఇలా చేస్తే టేస్టు అదుర్స్..! -
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్‌కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications