ఆరోగ్యంగా ఉన్నా సడన్​ హార్ట్​ ఎటాక్, ఎందుకు - ముప్పు తప్పాలంటే..!!

గుండెపోటు. ఈ మధ్య కాలంలో శారీరకంగా పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ ఉన్న వారు ఈ గుండెపోటు తో కుప్ప కూలిపోతున్నారు. హైబీపీ.. మధుమేహం వంటికి లేకపోయినా.. హఠాత్తుగా గుండె ఆగి పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మరణాల పైన వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఎందుకీ సడన్ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి.. వీటి వెను కారణాల పైన లోతుగా పరిశీలించగా ఆసక్తి కర అంశాలను గుర్తించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అవగాహన కల్పిస్తున్నారు.

గుండె స్పందనల్లో ముఖ్యమైనవి వెంట్రిక్యులర్ టెకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. హఠాత్ తుగా గుండె ఆగిపోవటానికి 99 శాతం వరకూ కారణంగా చెబుతున్నారు. రక్తనాళాల్లో పూడికలూ గుండె పోటుకు కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పూడికల వల్ల గుండెకు రక్త ప్రవా హం తగ్గుతుందని, దీంతో హార్ట్​ ఎటాక్​ సంభవిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 50 శాతం మరణాలకు కారణం ఇదే అని చెబుతున్నారు. ఇలాంటి వారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌక ర్యం వంటి లక్షణాలు మొదలైన గంటలోపే కుప్పకూలుతున్నారని పేర్కొంటున్నారు. కొంత మందిలో కణస్థాయిలో సోడియం, పొటాషియం మార్గాల్లో లోపాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో గుండె విద్యుత్ వ్యవస్థ సరిగా పనిచేయక కుప్పకూలుతున్నారని వివరిస్తున్నారు.

what-are-some-new-causes-of-sudden-cardiac-arrest-preacuations

మయోకార్డిటిస్ అనే గుండె కండరాల వాపు వల్ల కూడా హఠాత్తుగా గుండెపోటు వస్తుందని నిపుణు లు చెబుతున్నారు. ఈ సమస్య వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని, కొవిడ్ 19 తర్వాత ఈ సమస్య ఎక్కువ అయినట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇతర భాగాల్లో ఏర్పడే రక్తం గడ్డలు గుండె రక్తనాళాలకు చేరుకోవటంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చుని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు రక్తంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు పడిపోవటమూ కారణం కావొచ్చు. తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతోనూ గుండె విద్యుత్ వ్యవస్థ విఫలం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.డీప్​ ఫ్రై చేసిన ఫుడ్స్​, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం కూడా గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ధూమపానం, అతి మద్యపానం కూడా కారకాలు గా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరిగి గుండెపై భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నిరంతర ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం కూడా గుండె సమస్యలకు దారితీయవచ్చుని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, గుండె కు సంబంధించి ఎలాంటి సమస్య.. అసౌకర్యం ఉన్న వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించటం ద్వారా ముప్పు తప్పించుకునే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+