శృంగారం చేయడానికి అనువైన సమయం ఏది?
శృంగారానికి "అనువైన" సమయం అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలు, దంపతుల అలవాట్లు, వారి దినచర్యలు, శారీరక, మానసిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దిష్ట సమయం అందరికీ సరిపోదని చెప్పలేము. అయితే శాస్త్రీయంగా, మానసికంగా కొన్ని సమయాల్లో శృంగారానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం సమయంలో శృంగారంలో పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు, స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది లైంగిక కోరికను పెంచుతుంది. దీనివల్ల మెరుగైన లైంగిక పనితీరు సాధ్యపడుతుంది. కొంతమంది రాత్రి సమయంలో విశ్రాంతిగా ఉంటాం కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకుంటారు.
ఉదయం ప్రయోజనాలు
శృంగారం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఉదయం పూట శృంగారం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా ఉండవచ్చు. ఆక్సిటోసిన్ విడుదల కావడం వల్ల భాగస్వాముల మధ్య బంధం, సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలు ఉదయం శృంగారం రోగనిరోధక శక్తిని పెంచుతుందని, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కేలరీలను ఖర్చు చేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రాత్రి ప్రయోజనాలు
సాంప్రదాయకంగా రాత్రిపూట శృంగారానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. రోజంతా పని చేసి అలసిపోయిన తర్వాత శృంగారం ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. శృంగారం తర్వాత విడుదలయ్యే హార్మోన్లు నిద్రను ప్రోత్సహించి మెరుగైన నిద్ర పట్టడానికి సహాయపడతాయి. చాలా జంటలకు రాత్రిపూట ఎక్కువ సమయం, గోప్యత లభిస్తుంది. దీనివల్ల త్వరపడకుండా పూర్తిగా అనుభూతిని పొందడానికి సహాయపడుతుంది.
భాగస్వాములిద్దరూ మాట్లాడుకొని అనువైన సమయాన్ని ఎంచుకోవాలి. పిల్లలు ఉన్నవారు వారు నిద్ర లేవకముందు ఉండే సమయం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా ఉదయంపూట శారీరక ప్రయోజనాలు, రాత్రిపూట మానసిక ప్రయోజనాలుంటాయి. ఇద్దరూ ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా రిలాక్స్ డ్ గా శృంగారంలో పాల్గొనాలి.












Click it and Unblock the Notifications