తెల్ల ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు?
ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని మన పెద్దలు చెబుతుంటారు. వందకు వందశాతం ఇది నిజం. ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉల్లిపాయను వినియోగిస్తున్నారు. అందరూ ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయను వినియోగిస్తుంటారు. ప్రధానంగా తెల్ల ఉల్లిపాయలో ఔషధ గుణాలు మెండు. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకం పూర్తికాదు. ఆహారానికి రుచిని జోడిస్తుంది. తెల్ల ఉల్లిపాయ తినడంవల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
తెల్ల ఉల్లిపాయ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అధిక మొతాదులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను దృఢంగా చేస్తుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ఇందులో ఉండే ప్రీబయోటిక్ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి రక్తపోటును తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెలా రాసుకోవాలి. ఇలా నెలరోజులు చేయాలి. జుట్టు రాలే సమస్య నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడంవల్ల రాలే సమస్య కూడా తగ్గుతుంది. తేనెతో కలిపి దీన్ని తీసుకుంటే ఉదర సంబంధ వ్యాధులు దూరమవుతాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కంటికి, చెవికి, ముక్కుకు ఇన్ఫెక్షన్ ఉంటే తెల్ల ఉల్లిపాయను తినడంవల్ల నయమవుతుంది. సల్ఫర్, ఫ్లేవనాయిడ్ యాంటీ-ఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయలలో ఎక్కువగా ఉండి క్యాన్సర్ తో పోరాడటానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది. విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి.












Click it and Unblock the Notifications