రాత్రివేళ పుల్కాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

నూనె లేకుండా మంటపై కాల్చేదే పుల్కా. చపాతీ లాగే దీని తయారీలో గోధుమపిండినే వాడతారు. నూనె వాడకపోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూసే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. నూనె లేకుండా తయారు చేసిన పుల్కాలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. బరువు నియంత్రణకు అనుకూలం. గోధుమల్లో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

పుల్కా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. మధుమేహులకు ప్రయోజనకరం. పుల్కాలు B1, B2, B3, B6, B9 వంటి విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. అవి సంపూర్ణ ఆరోగ్యానికి అవసరం. సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల వల్ల పుల్కాలు రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తాయి. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

గోధుమ పిండిలోని జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మొటిమల నివారణకు, కణాల పునరుత్పత్తికి ఇవి సహాయపడతాయి. ప్రదాయ వంట పద్ధతిలో తయారైన ఈ ఆహారం అనేక ప్రయోజనాలను అందిస్తూ, ఆధునిక ఆరోగ్య అవసరాలను తీరుస్తుంది. దేశంలో- ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో పుల్కాలు దైనందిక ఆహారంలో అంతర్భాగం. గోధుమ పిండితో తయారవుతాయి కాబట్టి పుల్కాలు, వీటితో పాటు చపాతీలు ఆరోగ్యకరమైనవి.

ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని నివారిస్తూ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందువల్ల పుల్కాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. శక్తిని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. పోషకాలు నిండిన పుల్కాలు బరువు తగ్గడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. గోధుమ ధాన్యంలోని కెర్నల్ నుండి వచ్చే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.

పుల్కాల్లో ఉండే పోషకాలు మొటిమలు, మచ్చలను నివారిస్తాయి. వీటి తయారీ కోసం వినియోగించే నాణ్యమైన గోధుమల్లోని ఐరన్.. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అన్నం లేదా పూరీలతో పోలిస్తే, మధుమేహం, జీవక్రియ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఇది అత్యంత అనుకూలమైన, శ్రేష్ఠమైన ఆహారంగా పుల్కాలను పరిగణిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+