పురుషులు స్త్రీల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారు?

సాధారణంగా పురుషులు స్త్రీల కంటే ఎత్తుగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి జన్యుపరమైన, హార్మోన్ల ప్రభావాలు, పర్యావరణ కారకాల కలయిక లాంటివి ఉన్నాయి. పురుషులలో XY క్రోమోజోమ్‌లు ఉండగా, స్త్రీలలో XX క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఎత్తును ప్రభావితం చేసే SHOX (Short Stature Homeobox) అనే జన్యువు X, Y క్రోమోజోమ్‌లు రెండింటిపై ఉంటుంది. స్త్రీలలో ఒక X క్రోమోజోమ్ ఎక్కువగా నిద్రాణంగా ఉన్నప్పటికీ, SHOX జన్యువు కొంతవరకు పనిచేస్తుంది.

SHOX జన్యువు ముఖ్య పాత్ర
పురుషులలో X, Y క్రోమోజోమ్‌లు రెండూ చురుకుగా ఉంటాయి, SHOX జన్యువు మరింత ఎక్కువగా వ్యక్తమవుతుంది. దీనివల్ల పురుషులలో ఎముకల పెరుగుదల ఎక్కువగా ఉండి ఎత్తు పెరుగుతారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ SHOX జన్యువు పురుషుల ఎత్తులో దాదాపు 25% పెరుగుదలకు కారణం. ఎత్తును ప్రభావితం చేసే 700 కంటే ఎక్కువ జన్యువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో కొన్ని జన్యువులు స్త్రీలు, పురుషులలో వేర్వేరుగా వ్యక్తమవుతాయి. ఈ అంశం కూడా ఎత్తులో తేడాలకు దారితీస్తుంది.

Why are men taller than women

టెస్టోస్టెరాన్ హార్మోన్ కీలక పాత్ర
పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా యుక్తవయస్సులో ఈ హార్మోన్ ఎముకల పెరుగుదలను, కండరాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది పురుషుల ఎత్తు పెరుగుదలకు దోహదపడుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. యుక్తవయస్సులో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు ఎముకల పెరుగుదల ప్లేట్లు త్వరగా మూసుకుపోతాయ. దీనివల్ల స్త్రీల పెరుగుదల పురుషుల కంటే ముందుగా ఆగిపోతుంది.

బాల్యంలో మంచి పోషకాహారం ఉండాలి
బాల్యంలో మంచి పోషకాహారం లభించడం ఎత్తు పెరుగుదలకు చాలా ముఖ్యం. సరైన పోషకాలు లేకపోవడం వల్ల పెరుగుదల కుంటుపడవచ్చు. బాల్యంలో తీవ్రమైన వ్యాధులు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి కూడా ఎత్తును ప్రభావితం చేస్తాయి. సరైన వ్యాయామం, తగినంత నిద్ర కూడా పెరుగుదలకు సహాయపడతాయి. ఈ కారణాలన్నీ కలిసి పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉండటానికి దారితీస్తాయి. అయితే ప్రతి వ్యక్తి ఎత్తు వారి తల్లిదండ్రుల నుండి సంక్రమించే జన్యువులు, వారి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది స్త్రీలు పురుషుల కంటే ఎత్తుగా ఉండటం కూడా మనం గమనించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+