మామిడి పండ్లను తినేముందు ఎందుకు నీటిలో నానబెట్టాలి? తెలుసుకోండి
వేసవికాలంలో పళ్లకు రారాజు అయిన మామిడి పండ్లను తినాలి అని ఆరాటపడని వారు ఎవరు ఉండరు. అయితే మామిడి పండ్లను తినాలి అనుకునేవారు, పండ్లను తినే ముందు మామిడి పండ్లకు సంబంధించి కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన మామిడి పండ్లను వెంటనే కడిగి కోసుకొని తినకూడదు.
మామిడి పండ్లు తినేముందు నీళ్ళలో నానబెట్టాలి
మామిడి పండ్లను తినే ముందు కనీసం రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. లేదంటే ఆ మామిడి పండ్లను తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు మామిడి పండ్లను తినేముందు నీళ్లలో నానబెట్టాలి అంటే.. నీళ్లలో మామిడి పండ్లను నానబెట్టడం వల్ల వాటిపై ఉండే మలినాలతో పాటు రసాయనాలు కూడా తొలగిపోతాయి.

కార్బైట్ తో పండిస్తున్న మామిడి పండ్లు
రెండు గంటలు నానబెట్టి ఆపై శుభ్రంగా తుడిచి మామిడిపండును తినడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పండ్లను రసాయనాలతోనే పండిస్తున్నారు. న్యాచురల్ గా పండిన మామిడి పళ్ళు విక్రయించేవారు చాలా తక్కువ మంది. కార్బైడ్ వంటి రసాయనాలతో పండించే మామిడి పళ్ళు తోలు పై భాగంలో ఈ రసాయనాలకు సంబంధించిన మూలాలు ఉంటాయి.
మామిడి పండ్లలో థర్మో జెనిక్స్
రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టినప్పుడు అవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు మామిడి పండులో ధర్మో జెనిక్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేస్తాయి. నీళ్లలో మామిడి పండ్లను నానబెట్టడం వల్ల ధర్మో జెనిక్స్ ఉత్పత్తి తగ్గుతుంది. నానబెట్టకుండా మామిడి పండ్లను తింటే మామిడి పండుకు ఉండే సొన కారణంగా నోట్లో పుండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. పండ్లను నీళ్లలో పెట్టకుండా తింటే వేడి కురుపులు మొటిమలు వస్తాయి.
మామిడి పండ్లపై హానికరమైన మందుల ప్రభావం
అంతేకాదు మామిడి చెట్లను సాగు చేసే రైతులు, కాత బాగా ఉండాలని అనేక రసాయనిక మందులను వాడుతారు. బాగా నీళ్లలో నానబెట్టి కడిగి తినకుంటే ఈ హానికరమైన మందుల ప్రభావంతో తలనొప్పి, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా అనేక కారణాల దృష్ట్యా మామిడి పండ్లను కచ్చితంగా నీళ్ళల్లో రెండు గంటల పాటు నానబెట్టిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని తినండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications