ఢిల్లీ ఎన్నికలు: యాక్టర్ మనోజ్ తివారీకి బిజెపి టికెట్?

బిజెపిలో చేరే విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు, అలాగని కొట్టేయడం లేదు. అయితే తాను బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్‌ను కలిశానని, అది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, ద్వారకలోని తన కార్యక్రమాన్ని చూడడానికి గోయల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు.
గోయల్ కూడా ఆ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అయితే, పూర్వాంచల్ వోటర్లను తమతో పాటు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నామని అన్నారు. మనోజ్ తివారీ విషయంపై జాతీయ నాయకులతో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 2009లో మనోజ్ తివారీ గోరక్‌పూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోకసభకు పోటీ చేశారు.
మనోజ్ తివారీ బిజెపిలో చేరుతారని 2011లోనే ప్రచారం సాగింది. ఆ ఏడాది జూన్ 4వ తేదీన రామ్‌దేవ్ బాబా రామ్ లీలా మైదానంలో చేపట్టిన ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఛత్ పూజ రోజును ఢిల్లీలో సెలవుగా ప్రకటించే ఆలోచన ఉందని బిజెపి ప్రకటించింది.












Click it and Unblock the Notifications