ఎ ఫర్ ఆదర్శ్, బి ఫర్..: కాంగ్‌పై మోడి వ్యంగ్యాస్త్రాలు

జైపూర్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ మంగళవారం 'ఎబిసిడి'లకు భిన్నంగా విపులీకరించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎ అంటే ఆదర్శ్ అక్రమాలు, బి అంటే బోఫోర్స్ కుంభకోణం, సి అంటే బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాలు, డి అంటే అల్లుడి కుంభకోణం(రాబర్డ్ వాద్రాను ఉద్దేశించి) అని మోడీ ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు హయాంలో అవినీతికి అంతే లేదన్నారు. అవినీతి కాంగ్రెసుకు ఆభరణం వంటిదని సెటైర్ వేశారు. ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైనా విరుచుకు పడ్డారు. జి 20 సమ్మిట్‌లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదని కానీ, మన్మోహన్ మాత్రం తన కొత్త బాస్ పేరు ప్రకటించారని రాహుల్ గాంధీ నేతృత్వంలో పని చేస్తానన్న ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. మన దేశం నుంచి అవినీతి పోవాలని భావిస్తే, కేంద్రంలో అధికారం నుంచి కాంగ్రెస్‌ను తరిమేయాలన్నారు.

Narendra Modi

దేశం విధ్వంసపుటంచున ఉందని, స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరన్నారు. ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమని, దేశంలోని చిన్నారుల కోసం ఆ పార్టీ కొత్త ఎబిసిడి పుస్తకాన్ని రాసిందన్నారు.

మన ప్రధాని మన్మోహన్ జి-20 సదస్సుకు వెళ్లారని, అక్కడ ఆయన ఏయే అంశాలను లేవనెత్తారు? అంతర్జాతీయ సమాజానికి ఏం చెప్పారనే విషయాలు ఎవరికీ తెలియవని, కానీ, రాహుల్ నాయకత్వంలో పని చేయడం తనకెంతో ఇష్టమంటూ ఆయన చెప్పిన విషయం అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.

సరైన నిర్ణయాలు తీసుకోలేని, ఎటువంటి బాధ్యత, అధికారాలు లేని ప్రభుత్వం పదేళ్లుగా కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూపాయి ఆస్పత్రిలో చేరిందని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+