రాజకీయ పార్టీల ప్రమేయం: యూపి అల్లర్లపై షిండే

ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనపై పూర్తి నివేదిక వచ్చాక గానీ రాజకీయ పార్టీల ప్రమేయం గురించి కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే, పార్టీల కుట్ర ఉండి ఉండవచ్చునని చెప్పారు. అల్లర్ల ఘటనలో రాజకీయ పార్టీల ప్రమేయం ఏమైనా ఉందని అని ప్రశ్నించినప్పుడు షిండే పైవిధంగా స్పందించారు.
2014 ఎన్నికల జరగనున్న నేపథ్యంలో దేశంలోని 11 ప్రధాన నగరాల్లో ఘర్షణలు జరిగే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ప్రభుత్వం పదకొండు రాష్ట్రాలకు హెచ్చరికలు పంపిందన్నారు. పదకొండు రాష్ట్రాలను అలర్ట్‌గా ఉండగమని చెప్పామన్నారు.
ఘటన విషయంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఘటన అనంతరం అక్కడ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. 80 కంపెనీల పారామిలటరీ దళాలను పంపించామన్నారు. ఆర్మీ కూడా ఉందన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ వాతావరణం లేదన్నారు. క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోందన్నారు.












Click it and Unblock the Notifications