కృష్ణాష్టమి ఈరోజు జరుపుకోండి
పండగలను తిథుల ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ఉదయించే రోజు తిథి ఏది ఉంటే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథులు మిగులు, తగులు ఉండటంతో ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం నెలకొంది.
అష్టమి ఘడియలు: సెప్టెంబరు 6 సప్తమి బుధవారం రాత్రి 7.58 గంటల వరకు ఉంది. అనంతరం అష్టమి ఘడియలు మొదలవుతాయి.సెప్టెంబరు 7 అష్టమి గురువారం రాత్రి 7. 47 గంటల వరకు ఉంది. కన్నయ్య జన్మనక్షత్రం రోహిణి సెప్టెంబరు 6 బుధవారం మధ్యాహ్నం 2.42 గంటల వరకు కృత్తిక నక్షత్రం ఉంది. తర్వాత రోహిణి నక్షత్రం సెప్టెంబరు 7 గురువారం మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉంది.

కృష్ణాష్టమి ఎప్పుడు: పంచాంగకర్తలు కృష్ణాష్టమిని ఆరోతేదీనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. శ్రీకృష్ణుడు శ్రావణ మాసం బహుళాష్టమి అర్థరాత్రి సమయంలో జన్మించాడు. వసుదేవుడిద్వారా గోకులం చేరుకుంది తర్వాతరోజు ఉదయం. అందుకే కన్నయ్య జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండటం ప్రధానమంటారు. వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.
కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్ర నామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం తెలియజేస్తోంది.
-
జన్మ నక్షత్రం కృత్తిక, రోహిణి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలున్నాయా? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications