24న మాఘపూర్ణిమ.. ఇలా చేయండి.. అన్ని కోరికలు తీరతాయి

హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని పిలుస్తుంటారు. ఆ రోజు శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల కోరికలు నెరవేరతాయనే విశ్వాసం ఉంది. అదేరోజు స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యం ఉంది. మాఘపూర్ణిమ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 గంటల నుంచి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం 24వ తేదీ మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నానం, దానంతోపాటు పూజ కూడా చాలా శుభప్రదం.

2024 Magha Purnima details

మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు. ఆరోజు వారు గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘపూర్ణిమ రోజు స్నానం చేయడంతోపాటు అదేరోజు దానం కూడా చేయాలి. ఆరోజు ఉపవాసం ఉండటంవల్ల కోరికలన్నీ నెరవేరతాయి. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడంవల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+