మహా శివరాత్రి రోజు త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై కనక వర్షం
ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది. శివపార్వతుల కల్యాణం రోజు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం మార్చి 8న రానుంది. ఆరోజు కుంభరాశిలో సూర్యుడు, శుక్రుడు, శని కలయికవల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశులవారికి బాగా కలిసిరానుంది.
తులరాశి
ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో ఒప్పందం కుదురుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

మకరరాశి
ప్రేమ విజయవంతమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. సమస్యలు దూరమవుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ ఉంటుంది. అదృష్టం తోడుంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో ఎంతో సులువుగా పూర్తవుతాయి.
మేష రాశి
ఈ రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు విజయం దక్కుతుంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలున్నప్పటికీ అవి ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి.
వృషభ రాశి
వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ఆర్థికంగా లాభపడతారు. చేపట్టే ప్రతి పనిలోను విజయం లభిస్తుంది. సంతానం లేదని బాధపడుతున్నవారికి సంతాన యోగ్యం ఉంది. పనిని సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఎంతో పట్టుదలగా అధిగమిస్తారు.












Click it and Unblock the Notifications