2025లో వీరిపై సంపదల సునామీ.. గురితప్పదన్న వేణుస్వామి!

2025 సంవత్సరంలో అన్ని రాశుల వారు తమ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి తన జ్యోతిష్య అంచనాలను వెల్లడించారు. ప్రస్తుతం మిధున రాశి పైన వేణు స్వామి జ్యోతిష్యం అంచనాను తెలుసుకుందాం.

మిధున రాశి వారికి 2025 ఎలా ఉంటుంది
మృగశిర మూడు, నాలుగు పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు ఒకటి, రెండు, మూడు పాదములలో పుట్టినవారు మిధునరాశి జాతకులు. ఈ సంవత్సరము వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. గురువు వ్యయంలో నుండి లగ్నంలోకి వస్తున్నాడు. అలాగే శని, రాహువు కూడా అనుకూలంగా ఉన్నారు. దీంతో మిధునరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది.

2025 Gemini Horoscope Venu swamy said that wealth to this zodiac sign in 2025

రాజకీయ నాయకులకు ఇలా
ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి మిధునరాశి వాళ్ళకి యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది. గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. కచ్చితంగా జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారు. అలాగే జనాల విపరీతమైన ప్రేమను పొందుతారు . పార్టీ పెద్దల యొక్క అనుమతితో, వాళ్ళ సంకల్పంతో వాళ్ళ ప్రేమతో ఏదైనా పదవులను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి .

విద్యార్థులకు ఇలా... విదేశాల్లో ఉన్నవారు జాగ్రత్త
అలాగే విద్యార్థులకు పూర్తిస్థాయిలో అనుకూల ఫలితాలు వస్తాయి. కాకపోతే ద్వితీయార్థంలో చెడు అలవాట్ల వల్ల ర్యాంకులు తగ్గే అవకాశం ఉంది . కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారికి పేపర్స్ మిస్సింగ్ వల్ల అంటే వీసా రిలేటెడ్ గానీ, డాక్యుమెంటేషన్ రిలేటెడ్ గాని పేపర్లు ఏమైనా మిస్ అవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు .కాబట్టి డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి.

ఉద్యోగస్తులకే కాదు వీరికి అనుకూలం
ఉద్యోగస్తులకు సంబంధించి అనుకూలంగా ఉంది. ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్లు గానీ, మ్యూచువల్ ప్రమోషన్ గాని అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో పై అధికారుల మన్ననల్ని పొందుతారు. న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు, డాక్టర్లకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. హాస్పిటల్స్ ఉన్నవారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆర్ధికంగా సంపదల సునామీ కనిపిస్తుంది.

రైతులకు, స్త్రీలకు ఇలా
2025 సంవత్సరంలో రైతులకు సంబంధించి ఫస్ట్ పంట చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ సెకండ్ పంట మాత్రం కొద్దిగా తక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండవ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం స్త్రీలకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. మొత్తంగా ఈ సంవత్సరం ఏవైనా చెడు అలవాట్ల వల్ల చెడు స్నేహితుల వల్ల సమస్యలు తప్ప ఇతరత్రా జాతక పరంగా పూర్తిగా అనుకూలంగా ఉండనుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+