2025లో ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం రాహువు కీలకమైన గ్రహం. వ్యక్తి జాతకంలోని వివిధ దశలపై ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే ఏడాది రాహువు శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు అన్నీ శుభాలే కలగనున్నాయి. రాహువు సంచారం చేస్తూ తీర్థయాత్రలు, చర్మవ్యాధులు, దొంగతనం, ప్రయాణం, జూదం, మాటలకు కారణమవుతుంది. ఈ రంగాలన్నీ ప్రభావితమవుతాయి. రాహువు సంచారం ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథునం
మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తికావడానికి ఇది మంచి సమయం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. చేతికి రాదు అనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఇది మంచి సమయం. ఈ సమయంలో చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

వృషభం
వ్యాపార పరంగా పర్యటనలు ఉంటాయి. ఇవి కలిసివస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. సామర్థ్యం పెరగడంవల్ల పనులు చేసే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులతోపాటు ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.
కుంభరాశి
రాహువు సంచారంవల్ల ఆత్మవిశ్వాసం పెరిగి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. చేసే పనులన్నింటిలో విజయాన్ని అందుకుంటారు. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది. చేసే పనుల కోసం వేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి. మొత్తానికి ఇప్పటివరకు ఉన్న జీవనశైలి మొత్తం మారిపోయి కొత్త జీవనశైలి వస్తుంది.












Click it and Unblock the Notifications