ఈ నెల 24, 25 చాలు.. ఈ రాశుల జీవితం మలుపు తిరగడానికి
ఈనెల 24, 25 తేదీల్లో చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ తేదీల్లోనే బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించడంవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. అలాగే శుక్రుడు తులారాశిలో, శని సొంత రాశిలో ఉండటం అనే కీలకమైన పరిణామాలు ఈ రెండురోజుల్లోనే చోటుచేసుకోబోతున్నాయి. వృషభరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ పరిణామాలన్నీ కలిపి ఆరు రాశులకు అరుదైన అదృష్టాన్ని కల్పిస్తోంది. వారికి ఏవిధంగా కలిసిరాబోతోందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషం
వీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులతోపాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా విదేశీ యానం ఉంది. వివాహంతోపాటు గృహ ప్రవేశాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

వృషభం
జీవితంలో సానుకూల మలుపులు చోటుచేసుకుంటాయి. వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధించడంతోపాటు కొత్త పనులు చేయడానికి ఇది మంచి సమయం.
మిథునం
ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అవకాశం ఉంటే అక్కడే స్థిరపడతారు. ఆదాయం పెరిగి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పిత్రార్జితం కలిసివస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
కన్య
మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ యానం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
విలాసవంతమైన జీవితం గడుపుతారు. బాగా ఉన్నవారి కుటుంబానికి చెందినవారితో పెళ్లి జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆదాయం క్రమేణా పెరుగుతూ వస్తుంటుంది.
మకరం
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. శుభవార్తలను వింటారు. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది. న్యాయ సంబంధమైన విషయం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది.












Click it and Unblock the Notifications