2025 వరకు ఈ నాలుగు రాశులకు తిరుగులేదు.. శని దేవుడి చల్లని చూపు వీరిపైనే..
క్రమశిక్షణ నేర్పించే గ్రహంగా శనిని భావిస్తుంటారు. ఇది మెుత్తం 12 రాశులవారిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరగటానికి ఈ గ్రహానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని సంచారం జన్మరాశి కుంభంలో కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలో 4 రాశులవారికి అత్యంత ప్రయోజనకరమైన సమయంగా ఉంది. వివరాల్లోకి వెళితే..
మేష రాశి: శని తన స్వంత రాశి కుంభంలో సంచరించడం మేష రాశివారికి మంచి కాలాన్ని తెచ్చిపెడుతోంది. ఎందుకంటే శని కార్యాధిపతిగా వ్యవహరిస్తూ లాభ గృహంలో ఉన్నారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశంతో పాటు కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో నిలిచిపోయిన పనులు పరిష్కారానికి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. అలాగే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న మేష రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ కాలంలో లభించనున్నాయి.

వృషభ రాశి: వృషభం వారికి శనిగ్రహం శుభప్రదమైనది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేసుకోవటంలో శని దోహదపడుతుంది. పైగా శని ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని, ఆస్తి పెరుగుదలను కూడా అనుగ్రహిస్తారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపుతడతాయి. శని గోచారం వల్ల అన్ని రంగాల్లో ఉన్న ఈ రాశివారు విజయాన్ని పొందనున్నారు.
మిథున రాశి: శని ప్రస్తుత సంచారంతో మిథునరాశి వారికి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ సమయంలో మీ అదృష్టం రెట్టింపవుతుంది. కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు ప్రయాణాలు ముఖ్యంగా.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వారి విదేశీ ప్రయత్నాలు విజయం పొందుతాయి.
తులా రాశి: శని సంచారం కారణంగా తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. శని మీ ట్రాన్సిట్ చార్ట్‌లో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. అదే సమయంలో ఆనందం, వనరులకు అధిపతిగా ఐదవ ఇంట్లో ఉన్నారు. మీరు ఆస్తిని లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ సంపదను పెంచుకోవచ్చు. తుల రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభాలను పొందవచ్చు. శని ప్రభావంతో స్థానికంగా గౌరవం, ప్రతిష్టలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications