ఈ రాశులపై వచ్చే నెలలో ధన వర్షం..!
జ్యోతిష్యం ప్రకారం అంగారకుడు ధైర్యం, విశ్వాసానికి ప్రతికగా భావిస్తారు. అంగారకుడు మార్చి 15న కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల జాతకాల్లో కుజుడి స్థానం ప్రత్యేకంగా ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వృత్తి జీవితంతోపాటు వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుతారు. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా బాగుంటుంది అనే విషయాలను సవివరంగా తెలుసుకుందాం.
మేష రాశి
రాజకీయంగా ఈ రాశివారికి మంచి లాభాలున్నాయి. సులభంగా ప్రతి పనిలోను విజయం సాధించగలుగుతారు. అదృష్టం తోడుంటుంది. వివాహితుల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. త్వరలోనే శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.

కుంభరాశి
ఈ సమయంలో ప్రయాణం చేయడం అనేది ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. కెరీర్ కు సంబంధించిన విషయాల్లో అకస్మాత్తుగా మార్పులు ఎదురవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది.
తుల రాశి
ఉద్యోగాలు చేసేవారి ఆదాయం రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహితులకు ఈ సమయం ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుంది.
కర్కాటక రాశి
వీరికి ఊహించని ప్రయోజనాలున్నాయి. అంగారకుడి అనుగ్రహం కూడా విశేషంగా లభిస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది.












Click it and Unblock the Notifications