రేపటి నుంచి ఈ రాశులవారికి డబ్బుల వర్షం
శ్రావణ మాసం 15వ తేదీ తర్వాత ప్రారంభం కాబోతోంది. ఈ కాలంలో గ్రహాల గమనంలో మార్పుచేర్పులు ఉంటాయి. సూర్యుడు, బుధుడు తమ స్థానాలను మారుస్తారు. శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. జులై నెల చివరి 15 రోజులు గ్రహాల కదలికలవల్ల 5 రాశులవారికి ఎంతో ప్రయోజనం కలగనుంది. కష్టాలను సులువుగా అధిగమిస్తారు. అవి ఏయే రాశులనేది తెలుసుకుందాం.
మేష రాశి:ఈనెల 15వ తేదీ తర్వాత ఈ రాశివారు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. గతంలో ఎవరికైనా రుణం ఇచ్చివుంటే ఈ సమయంలో దాన్ని తిరిగి పొందుతారు. అలాగే పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఆలోచనలు చేస్తుంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే నష్టాలు ఎదురవుతాయి.

వృషభ రాశి:ఈనెల 31 వరకు వీరికి అనుకూలం. పిల్లల విద్యాభ్యాసానికి సంతోషంగా ఫీలవుతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పాత స్నేహితుడిని కలుస్తారు.
సింహ రాశి:జులై 15 తర్వాత ఈ రాశివారి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో కొత్త పనులు చేస్తారు. చేసే పనులద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందడంతోపాటు ఆర్థికంగా శుభ ఫలితాలు పొందుతారు.
తులా రాశి:ఈనెల 31వ తేదీ వరకు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభవార్తలను వింటారు. ఉద్యోగస్తులకు వేతనం పెంపుతో ఇంక్రిమెంట్ పొందుతారు. ప్రత్యేక నైపుణ్యంతో సరికొత్త ఆదాయ వనరులను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
కుంభ రాశి:15వ తేదీ తర్వాత నుంచి శుభ ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలికలవల్ల ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారు శుభవార్తలను వింటారు. కుటుంబంతోపాటు వ్యాపార సంబంధాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఎటువంటి సమస్యనైనా ఈ సమయంలో అధిగమిస్తారు.












Click it and Unblock the Notifications