4 గ్రహాల అరుదైన కలయిక... ఈ రాశులకు భోగభాగ్యాలు కలుగుతాయి
ఈ నెలలో కొన్ని కీలక గ్రహాల సంయోగం జరుగుతోంది. 20, 21, 22 తేదీల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుడు, చంద్రుడు, గ్రహాలకు అధిపతి సూర్యుడు కలుసుకుంటున్నాయి. ఈ నాలుగు గ్రహాలను బృహస్పతి వీక్షిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు భోగభాగ్యాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. అదృష్టం తలుపు తడుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏ పని చేసినా కలిసివస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. స్టాక్ మార్కెట్ వ్యాపారం బాగుంటుంది. ప్రయత్నం చేయడంవల్ల ధనయోగం ఉంది.

మకర రాశి
ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసివస్తుంది. వ్యాపారంలో, వృత్తిలో లాభాలున్నాయి. మనసులో కోరికలన్నీ నెరవేరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
మీన రాశి
విదేశీ సంపాదనను ఈ రాశివారు అనుభవించడానికి మంచి అవకాశం ఉంది. తండ్రివైపు నుంచి, పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులకు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పెళ్లిళ్లు కూడా విదేశాల్లో ఉన్నవారితో కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ నాలుగు గ్రహాలను గురువు చూడటంవల్ల ఉద్యోగంలో పదోన్నతి, వేతనం పెరుగుతుంది. వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్ లో లాభాలుంటాయి. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
కర్కాటక రాశి
కలలో కూడా ఊహించనిరీతిలో రాజయోగాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా అధికార యోగం పడుతుంది. కుటుంబం నుంచి, బయట నుంచి శుభవార్తలు వింటారు.
తులారాశి
ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టుల్లో తీర్పులు మీవైపే వస్తాయి. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. రుణాలన్నింటినీ తీర్చేశారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి వస్తుంది. కొద్ది ప్రయత్నంతోనే వీరు సంపన్నులవడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications