లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చిన్న చిట్కా!
ఇంట్లో డబ్బు నిలవడంలేదని, సంపాదించినదంతా ఖర్చైపోతోందని కొందరు బాధపడుతుంటారు. చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కొత్త ఆదాయ మార్గాల కోసం కొందరు అన్వేషిస్తుంటారు. ఈరకమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిన ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది.
ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక పాత్రలోకి మంచినీరు తీసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, పూజకు వాడే పసుపు చిటికెడు వేయండి. ఆ పాత్రను పూజామందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఉంచాలి. నిత్యం అమ్మవారికి పూజ చేయాలి. మరుసటి రోజు ఆ పాత్రలోని నీటిని తులసి కోటలో పారబోయాలి. తాజా నీటిని పాత్రలోకి తీసుకుని యథాప్రకారం పచ్చకర్పూరం, పసుపును అందులో వేసి పూజ గదిలో ఉంచండి.

ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ గృహంలో సిరిపంపదలు విరజిల్లుతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. పెద్దగా ఖర్చుతో కూడిన పనికాదు కాబట్టి దీన్ని వెంటనే మీరూ ఆచరణలో పెట్టి చూడండి.. ఫలితం వెంటనే మీకు అనుభవంలోకి వస్తుంది.












Click it and Unblock the Notifications