వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ఇంట్లో చెత్తనంతా ఊడ్చేది చీపురే. ఒకరకంగా దాన్ని లక్ష్మీదేవిలా చూస్తారు. నిర్లక్ష్యంగా విసిరేయడం, నిలబెట్టడం లాంటివి చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎలా ఉంచాలి? ఎక్కడ ఉంచాలి? ఎలా సంరక్షించాలి? అనే విషయంలో కొన్ని నియమాలతోపాటు విశ్వాసాలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే ఇంట్లో డబ్బు నిలబడుతుంది. అయితే చాలామందికి ఈ విషయాలు తెలియక కొన్ని సమస్యల్లో చిక్కుకుంటుంటారు.
వాస్తు ప్రకారం చీపురును నిలబెట్టకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి రాక ఆగిపోతుంది. అలాగే మూలకు విసిరేయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చీపురును తలకిందులుగా కూడా ఉంచకూడదు. ఇలా ఉంచితే లక్ష్మీదేవి తనకు అవమానంగా భావిస్తుంది. అందుకే చీపురును శ్రద్ధగా ఉంచడంతోపాటు చాలా గౌరవంగా చూసుకోవాలి.

చీపురుకు పొరపాటున మన కాలు తగిలితే తప్పైపోయిందని నమస్కరించుకోవాలి. దాన్ని సురక్షితంగా పెట్టాలి. చీపురుతో ఊడ్చిన తర్వాత దాన్ని నిలబెట్టకూడదు. కింద పెట్టాలి లేదంటే వేలాడదీయాలి.
కొత్తచీపురు కొనుగోలు చేసిన తర్వాత పాత చీపురును తీసేస్తాం. అయితే పాత చీపురులోని చివరి భాగాన్ని కొత్తదానిలో పెట్టాలి. దీనివల్ల పేదరికం దగ్గరకు రాదు. సంపద క్షీణించదు. చీపురును ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టాలి. నిపుణులు చెపుతున్నదాని ప్రకారం గుడ్డతో కప్పితే మంచిదంటున్నారు.
వాస్తవానికి వాస్తు అనేది ఒక పురాతన శాస్త్రం. మన పెద్దలంతా దాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం చాలామంది తేలికగా తీసేస్తున్నారు. కానీ దేని విలువ దానికి ఉంటుంది. ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు మన భారతీయ సంప్రదాయంలో భాగం. చీపురును కూడా పూజ్యంగా పరిగణించాలి. ఇవి కేవలం మూఢనమ్మకాలు కావని, మన జీవన శైలిలో సంపదను తెచ్చేందుకు, సుస్థిరతను సూచించే మార్గాలు. వీటిని అర్థం చేసుకొని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications