వాస్తు ప్రకారం ఈ ఒక్క మొక్క ఇంట్లో ఉంటే దోషాలన్నీ పోయి సంపద వస్తుంది..!
మన పురాణాల ప్రకారం భగవంతుడికి సమర్పించడానికి చాలా సులభంగా దొరికే పుష్పం మందార పువ్వు. మందరం సంపదను ఆకర్షిస్తుందని మొదటి నుంచి శాస్త్రాల్లో ఉంది. ఇట్లో ఈ మొక్కను నాటితే కుటుంబం అంతటికీ శ్రేయస్సుతోపాటు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే వాస్తు ప్రకారం మందార మొక్కను ఇంట్లో ఏ దిశగా నాటాలనే సందేహం చాలామందిలో ఉంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
శుక్రవారం, శనివారం మందార మొక్కను ఇంట్లో నాటాలి.
దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు.

వేర్వేరు ప్రదేశాల్లో నాటితే వేర్వేరు ప్రయోజనాలు లభిస్తాయి.
పూజాస్థలం దగ్గర నాటడంవల్ల ఇంటికి సంబంధించిన రుగ్మతలన్నీ తొలగిపోతాయి.
మందార మొక్కను నాటేందుకు ఉత్తర దిక్కు చాలా శ్రేయస్కరం.
మనసును చాలా ప్రశాంతంగా మందార పువ్వు ఉంచుతుంది.
చెడు శక్తులను దూరం చేస్తుంది.
రాత్రివేళ రాగి గిన్నెలో నీటిలో మందార పువ్వులను ఉంచి, సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లడం శుభప్రదం.
ఆగ్నేయం దిశలో మందార మొక్కను పెంచితే ఆ కుటుంబంలో స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావు.
డబ్బులు ఉంచే ప్రదేశంలో మందార పువ్వులను ఉంచొచ్చు.
మందార మొక్క ఇంట్లో ఉంటే కుజుడిని శాంతపరిచి జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను తగ్గిస్తుంది.
మందార మొక్క అందాన్నే కాదు.. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా సానుకూల ప్రయోజనాలు అందిస్తుంది.












Click it and Unblock the Notifications