వాస్తు ప్రకారం గుడి పక్కన ఇల్లు మంచిదా? బాత్‌రూం పక్కన దేవుడి గది ఉండొచ్చా?
ఇల్లు నిర్మించుకొనేటప్పుడు, స్థలం కొనేటప్పుడు కూడా వాస్తు చూడటం అవసరం. చాలామంది వీటిని కచ్చితంగా పాటిస్తారు. అయితే ఇంటి నిర్మాణానికి ముందు, స్థలం కొనుగోలు నిర్మాణానికి ముందు కొనుగోలుదారులకు అనేకరకాల సందేహాలు వస్తుంటాయి. మనం కొన్న స్థలానికి ఎడమవైపు దేవాలయం ఉంటే కొనొచ్చా? ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా? అనే సందేహం వెంటాడుతుంది. అంటే ఇంట్లో బాత్‌రూం గోడకు ఆనుకొని పూజగది ఉండొచ్చా? లేదంటే వంటగది ఉండొచ్చా? అని నిపుణులను అడుగుతుంటారు. వాటికి సంబంధించి వెంటాడుతున్న సందేహాలకు పరిష్కారం తెలుసుకుందాం.
గుడికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయకూడదు.
దేవుడి చూపు పడేట్టుగా ఇల్లు కట్టుకోవదని చెబుతుంటారు.
స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపైన లేదా స్థలం పైన పడకూడదు.
చిన్న గుడి అయితే ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు చిన్న చిన్న గల్లీల్లో కూడా అమ్మవారి దేవాలయాలు వెలుస్తున్నాయి.

ఇటువంటివాటివల్ల ఎటువంటి దోషం ఉండదు.
అయితే ఒకటి.. ఇంటి ఎత్తుకంటే.. గుడి ఎత్తు తక్కువగా ఉంటే పర్వాలేదు. ఏ సమస్యా ఎదురవదు.
గతంలో గుడికి కుడివైపు ఇల్లు కట్టుకోవద్దని చెప్పేవారు.
అయితే గుడి నీడ పడకుండా కొంచెం స్థలం వదిలేసి కట్టుకుంటే మంచిది.
గుడికి ఎడమవైపు స్థలం ఉంటే నిరభ్యంతరంగా ఇల్లు కట్టుకోవచ్చు.
దీనివల్ల ఎటువంటి దోషాలు ఉండవు.
వాస్తు సమస్య ఉందని ఇంటిని అమ్మేస్తే అవి వెంటనే తీరవు.
మార్చలేని దోషాలుంటేనే అమ్మండి.
చిన్న చిన్నమార్పులు చేసుకున్నా సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఎదుటివారి మాటు విని తొందరపడి ఇంటిని అమ్ముకోవద్దు.
వాస్తుతో పాటు జాతక దోషాలు కూడా ఉంటాయి.
బాత్ రూం గోడలకు వేరే గది ఏదైనా ఆనించి కట్టుకోవచ్చు.
దేవుడి గదికి దోషాలుంటాయంటారుకానీ ఉండవు.
గదుల మధ్య ఎప్పుడైతే గోడలు వచ్చాయో అప్పుడే మంచి, చెడులన్నీ మారిపోతాయి.












Click it and Unblock the Notifications