వాస్తు ప్రకారం ఈ 4 వస్తువులు ఇంట్లో సరైన దిశలోనే ఉండాలి.. ఒకసారి మీరు కూడా చూసుకోండి
వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే ఇంట్లో ఉండే కొన్నిరకాల వస్తువులు కూడా సంపదనివ్వడంతోపాటు సానుకూల శక్తిని కూడా ప్రసరింపచేస్తుంటాయి. దీనివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా వృద్ధిలోకి వస్తుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. అలంకరణ కోసమే కాకుండా చాలా శక్తివంతమైన సానుకూలతను ఇచ్చే ఆ వస్తువులు ఏమిటి? వాటిని ఏ దిశలో ఉంచాలి? అనే వివరాలను తెలుసుకుందాం.
ప్రవహించే నీరు ఇంట్లో ఉంటే శుభప్రదం.
సంపదను సుస్థిరంగా ఉంచుతుంది.
చురుకుదనాన్ని, శక్తిని పెంచుతుంది.
ఫౌంటెన్ ఉండొచ్చు.. అది ఈశాన్యం దిక్కులో ఉండాలి.

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండాలి.
దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది.
ఎటువంటి వివాదాలు ఏర్పడవు.
కుటుంబంలో వాతావరణం ఒత్తిడి లేకుండా ఉంటుంది.
లాఫింగ్ బుద్ధ ఉండటం ఎంతో శుభప్రదం.
మనీ ఫ్రాగ్ కూడా ఉండొచ్చు
ఇది మూడు కాళ్ల డబ్బు కప్ప.
నగదు ప్రవాహాన్ని, అదృష్టాన్ని తెస్తుంది.
లాఫింగ్ బుద్ధతోపాటు మూడు కాళ్ల కప్ప..
ఈ రెండింటినీ ఇంటి సింహ ద్వారం వైపు ఉంచాలి.
దీనివల్ల సంపద లోపలికి ప్రవేశిస్తుంది.
ఇలా చేయడంవల్ల సానుకూల ఆలోచనలు మీలో కలుగుతాయి.
జీవితంలో పురోగతికి మార్గం సుగమం అవుతుంది.
మనీ ప్లాంట్ అత్యంత పవిత్రమైంది.
ఆనందాన్ని, అదృష్టాన్ని తెస్తుంది.
దీనికుండే ఆకుపచ్చ ఆకులు జీవితంలో పురోగతిని సూచిస్తాయి.
ఇంటి బయట లేదంటే ఈశాన్య దిక్కులో ఉంచకూడదు.
ఈశాన్యంలో ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయి.












Click it and Unblock the Notifications