వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బును అస్సలు అక్కడ పెట్టకూడదు.. మీరు చూసుకోండి
వాస్తు అనేది అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుందని అంతా విశ్వసిస్తారు. ఆ నమ్మకంతోనే వాస్తు నియమాలను పాటిస్తుంటారు. అయినప్పటికీ కొన్నిరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటికి కూడా పరిష్కారం ఉంటుంది. గురువును ఆశ్రయించాలి. వాస్తు దోషాల వల్లే మనుషులకు అప్పులు పెరుగుతాయని, డబ్బులు నిలవవని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తుపరంగా లోపాలుంటే సరిచేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. డబ్బు ఇంట్లో నిలవడం లేదంటే అందుకు కారణం వాస్తు అంటున్నారు నిపుణులు. దోషాలను సరిచేస్తే చాలు అంటున్నారు.
బీరువా తలుపులు ఉత్తర దిశకు తెరుచుకునేలా ఉండాలి.
ఈశాన్యం మూలలో బీరువాలు పెట్టకూడదు.
వాయువ్యం మూలలో డబ్బు పెడితే త్వరగా ఖర్చవుతుంది.
బీరువా ఇంటి సింహద్వారానికి, కిటికీకి ఎదురుగా ఉండకూడదు.
దీనివల్ల డబ్బు ఖర్చైపోతుంది

డబ్బును చెత్త డబ్బాల దగ్గర, తుప్పు పట్టిన బీరువాలో ఉంచొద్దు.
వంటగదిలో అసలు పెట్టకూడదు.
ఉత్తరం లేదంటే నైరుతిలో డబ్బు దాచుకోవాలి.
డబ్బు ఉంచే స్థలం శుభ్రంగా ఉండాలి. కుబేర యంత్రం లేదంటే లక్ష్మీదేవి ఫొటో ఉండాలి.
డబ్బును ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో పెట్టకూడదు.
అలా చేస్తే ఖర్చైపోతుంటుంది.. నిల్వ ఉండదు.
మీకు శ్రేయస్సు కాదు.
బాత్రూమ్ గోడకు పక్కన ఉండే షెల్ఫ్ లో డబ్బు పెట్టకూడదు.
దీనివల్ల డబ్బు చేతుల్లో నిలవదు.
అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
అందుకే టాయిలెట్ గోడ పక్కన డబ్బు నిల్వ ఉండే షెల్ఫ్ ను పెట్టకూడదు.
డబ్బును ఒక మూలలో, చీకటి ప్రదేశంలో ఉంచకూడదు.
దీనివల్ల వాస్తు దోషాలు కచ్చితంగా ఏర్పడతాయి.
డబ్బు వచ్చినా నిలవ లేకుండా ఖర్చవుతుంటుంది.
అందుకే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications