18 నెలల తర్వాత మరో రాశిలోకి కేతువు.. ఈ రాశులవారికి పండగే

వేద జ్యోతిష్యంలో అశుభానికి చిహ్నంగా కేతువును పరిగణిస్తారు. రాహు, కేతువులిద్దరూ ఛాయాగ్రహాలు. గ్రహాలన్నీ సవ్యదిశలో పయనిస్తుంటే రాహు, కేతువులు మాత్రం అపసవ్య దిశలో పయనిస్తాయి. కేతువుకు ఏ రాశి యజమానిగా లేదు. నిశ్శబ్దం, మోక్షం, ఆధ్యాత్మికత మొదలైనవారికి కారకాలుగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం జరగబోయే కేతువు గ్రహ సంచార ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. కేతు సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

ప్రతి రాశిచక్రం మీద కొంత ప్రభావాన్ని చూపే సంచారాలుంటాయి. ఈ ఏడాది కేతువు రాశి మారబోతోంది. 2023 అక్టోబరు 30వ తేదీన కేతువు సంచారం ఉంటుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సింహరాశి, వృషభరాశి, ధనుస్సు రాశులవారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఈ రాశులవారు డబ్బులు సంపాదించడంలో విజయవంతమవుతారు. ఈ ఏడాది వారు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు. ఈ మూడు రాశులవారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం లేదంటే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం లాంటివి మానుకోవాలి. కేతు సంచారం మేష, మిథున, మకర రాశులకు అశుభం. ఈ రాశి వారికి ధన నష్టంతోపాటు వైఫల్యం కూడా ఉంటుంది.

after 18 months ketu enter another zodiac sign

వృషభ రాశి:వీరిపై కేతువు సంచారం సానుకూల ప్రభావాన్ని చూపతుంది. సుదీర్ఘంగా వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకం. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారికి కలిసివస్తుంది.

సింహ రాశి:సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ఆస్తిలో ఇన్వెస్ట్ చేయడంవల్ల భవిష్యత్తులో మంచి రాబడిని అందుకుంటారు. పనిచేసే చోట సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.

ధనుస్సు రాశి:స్థానికులు అనేక ప్రయోజనాలు పొందుతారు. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ లో పురోగతితోపాటు ద్రవ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+