18 ఏళ్ల తర్వాత అద్భుత కలయిక.. ఈ రాశులపై కనక వర్షం
దాదాపు 18 సంవత్సరాల తర్వాత శుక్రుడు, రాహువు మీనరాశిలో కలవబోతున్నారు. సంపద, సుఖం, కళలకు కారకుడు శుక్రుడు. వచ్చే నెల 31వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రాహువు అక్కడ ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు శుక్రుడు అక్కడే ఉంటాడు. ప్రధానంగా ఏయే రాశులవారికి లాభాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
వృషభ రాశి
వ్యక్తిత్వంలో కొంత మార్పు చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అలాగే వేతనం పెంపు కూడా ఉంది. దీర్ఘాకలం నుంచి వేధిస్తున్న ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతతను పొందుతారు. అలాగే అనారోగ్యం తొలగిపోతుంది. కొత్త స్నేహితుల కలయికతో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులకు విద్యార్జనలో లబ్ధి పొందుతారు.

మిథున రాశి
వాహనం కొనుగోలు, ఇల్లు, ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో లాభం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు విజయవంతమవుతారు. ఉన్నత చదువులకు వెళ్లాలనే కోరిక తీరుతుంది. కృషి, అంకితభావంతో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. మాటల చాతుర్యం ఉన్నవారికి మీరు ప్రేరణగా నిలుస్తారు. సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలోని తొమ్మిదో ఇంట్లో శుక్రుడు, రాహువు కలిసివుంటారు. దీనివల్ల కుటుంబంతోపాటు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మంచి లాభం కలుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి దూర ప్రయాణం చేస్తారు. అలాగే ఆధ్యాత్మికతవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది.












Click it and Unblock the Notifications