20 ఏళ్ల తర్వాత అరుదైన కేదార్ రాజయోగం.. ఈ రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం

గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ప్రయాణించడంద్వారా శుభ ఫలితాలతోపాటు అశుభ ఫలితాలను కూడా ఏర్పరుస్తున్నాయి. ఇవి మానవుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కొన్ని గ్రహాలు అరుదైన యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని దశాబ్దాల తర్వాత జరిగే పరిణామాలుగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ గ్రహాలు కేదార్ యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. మనిషి జాతకంలో 4 ఇళ్లల్లో 7 గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అన్ని రాశులపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే మూడు రాశులకు మాత్రం అదృష్టంతోపాటు ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఏయే రాశులనేది తెలుసుకుందాం.

మకర రాశి : ఈ రాశివారికి మహాకేదార్ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. సుఖాలను అనుభవిస్తారు. ఖరీదెక్కువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు పనితీరులో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. అలాగే వేతనం కూడా పెరుగుతుంది.

horoscopesigns

కర్కాటక రాశి : ఈ రాశివారికి మహాకేదార్ రాజయోగం అనుకూలంగా ఉంటుంది. వీరి సంచార జాతకంలో 11వ ఇంట్లో కేంద్ర త్రికోణం, గజకేసరి, బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఆస్తి లావాదేవీ నుండి ప్రయోజనం పొందడంతోపాటు రాజకీయాలతో ముడిపడివున్నవారికి పదవి దక్కుతుంది. అదే సమయంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిల్మ్ లైన్, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫీల్డులో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు. వారిని వారు నిరూపించుకుంటారు.

మేష రాశి : మహాకేదార్ రాజయోగం మేషరాశి వారికి ఫలప్రదంగా ఉంటుంది. ఈ యోగం మీ లగ్నంలోనే ఏర్పడుతోంది. గురువు, రాహువు, చంద్రుడితో కూటమి ఏర్పడుతున్నప్పటికీ శని తృతీయ దృష్టి కూడా పడుతోంది. మేష రాశి నుంచి రెండో ఇంట్లో సూర్యుడు, బుధుడితో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం వీరి మాటలను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో నాలుగో ఇంట్లో శుక్రుడు, కుజుడి కేంద్ర త్రిభుజ రాజయోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో వాహనంతోపాటు ఆస్తిని పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+