50 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు.. ఈ రాశులకు మహర్దశ
ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఇలా సంచరించే సమయంలో ప్రత్యేక యోగాలు, సంయోగాలు, తిరుగమనాల్లాంటివి ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావంవల్ల కొన్ని రాశులవారిపై అనుకూలంగా ప్రభావం ఉంటే మరికొన్ని రాశులవారిపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. సూర్యుడు ఈనెల 13వ తేదీన మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇందుకు ఏడాది సమయం తీసుకున్నాడు. శనికి ఎంతో ఇష్టమైన కుంభరాశిలోకి సూర్యుడు రావడంవల్ల సర్వార్ధ సిద్ధియోగం, రవి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలవల్ల మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతున్నప్పటికీ కొన్ని రాశులవారికి మాత్రం ఎంతో మేలు కలగబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి:
సర్వార్ధ సిద్ధయోగం, రవి యోగాలవల్ల మేష రాశి వారికి అనుకున్న పనులన్నీ సజావుగా జరుగుతాయి. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితంలోని ఆనందం రెట్టింపు అవుతుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

మిథున రాశి:
ఈ రెండు యోగాల వల్ల ఈ రాశివారికి మంచి లాభాలున్నాయి. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో ఉన్నవారి పురోగతికి మంచి అవకాశాలున్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
సింహరాశి:
వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో ప్రయోజనాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గతం నుంచి వేధిస్తున్న తీవ్ర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications