రేపు 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ ఒక్క పనితో ఏడాది మొత్తం ధనలాభం
మాసాల్లోకెల్లా పవిత్రమైన మాసం కార్తీకం. ఈ మాసంలో ఎక్కడ చూసినా శివకేశవులు కలిసివుంటారు. చిన్న నీటిగుంట కనపడినా చాలు.. అందులో కూడా వీరు ఉంటారు. ఈ మాసంలో చేసే దీపం, దానం, హోమం, వ్రతాలకు అంతులేని ప్రాముఖ్యత ఉంది. ప్రతి దానికి వెయ్యిరెట్ల ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో దేవతలంతా భూమి మీదకు వచ్చి ఈ నెలరోజు వారు కూడా భగవంతుణ్ని పూజిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోని అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.
ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాలి
కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఈనెల 30వ తేదీన అమావాస్య తిథి వచ్చింది. శనివారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఉంది. అయితే అమావాస్యను మనం శనివారమే జరుపుకుంటామని పండితులు తెలియజేస్తున్నారు. శనివారంరోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితానికి తిరుగుండదని, విపరీతమైన లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేయాలి. తర్వాత బొట్టుపెట్టుకొని ఆలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. దేవాలయానికి ముందు ఎదురుగా ఉండే ధ్వజస్తంభం దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి డబ్బులకు కొదవే ఉండదు. అమావాస్య రోజు తల్లిదండ్రులు మరణించివుంటే వారికి పండి ప్రదానాలు చేయాలి.

ఒకే సరళ రేఖ మీదకు శుక్రుడు, శని
అమావాస్య రోజున మనం చేసే ప్రతి పూజకు, వెలిగించే దీపానికి, వ్రతానికి వెయ్యిరెట్ల ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. నల్ల కుక్కలకు, కాకులకు, పేదలకు, మూగజీవాలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడంవల్ల మనకు ధనలాభంతోపాటు ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల కూడా నెరవేరుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 54 సంవత్సరాల తర్వాత శనివారం రోజు అమావాస్య వచ్చింది. అదేరోజు శుక్రుడు, శని గ్రహాలు ఒకే సరళరేఖమీదకు వస్తారు. దీనివల్లే ఈరోజుకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications