100 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు అరుదైన యోగాలు.. ఈ రాశులకు అతి గొప్ప ఐశ్వర్యం
అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పండగ. అలాగే కుబేరుడిని కూడా పూజిస్తారు. ఆరోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడంవల్ల కలిసివస్తుందని, చాలా శుభప్రదమని భావిస్తారు. చాలామంది ఉపవాసం ఉంటారు. ఈనెల 30వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోబోతున్నాం. ఆరోజు రాహువు, శుక్రుడు, శని గ్రహాలు సంచార దశలో ఉంటాయి. ఈ ప్రభావంవల్ల మూడు రాశులవారికి అష్టైశ్వార్యాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆరోజు 100 సంవత్సరాల తర్వాత గజకేసరి రాజయోగంతోపాటు మాలవ్య రాజయోగం కూడా ఏర్పడుతోంది. ఈ ప్రభావం వల్ల సంపద పొందే రాశుల వివరాలను పరిశీలిద్దాం.

వృషభ రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకోగలుగుతారు. దీనికి ఇది మంచి సమయం. ఉద్యోగాలు చేస్తున్నవారు తమ తమ కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరుపై మంచి పేరు వస్తుంది. అలాగే కొత్త బాధ్యతలు చేపడతారు. డబ్బును పొదుపు చేసుకుంటే ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు.
మిథున రాశి
ఈ రాశివారికి అక్షయ తృతీయ అంటే వరంలాంటిదని చెప్పొచ్చు. అదృష్టం తోడుండి అన్ని పనులు చాలా సులువుగా పూర్తిచేసి డబ్బును పొందుతారు. తల్లిదండ్రులతో అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు బలపడతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి కొత్తగా వేరేచోట ఉద్యోగాలు రావడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అక్షయ తృతీయ వీరికి అనేక లాభాలను అందిస్తుంది.
మీనరాశి
పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. వీరి కలలు నెరవేరతాయి. గతంలో వేరేవారి వద్ద నిలిచిపోయిన డబ్బు తిరిగి ఈ సమయంలోనే చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కల కూడా నెరవేరుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications