ఏప్రిల్ నెలలో ఈ రాశులవారు అదృష్టవంతులు
ఏప్రిల్ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చబోతున్నాయి. ఈ గ్రహాల ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. అంతేకాకుండా నెల ప్రారంభంలో శుక్రుడు వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు. రెండో వారంలో బుధుడు మేషరాశిలో తిరోగమనం చెందుతాడు. ఏప్రిల్ 22న గురుడి సంచారం ఉంటుంది. మేషంలో ఉదయిస్తాడు.
బుధుడు మేషంలోనే అస్తమించనున్నాడు. మేషం, మిధునంతో సహా అనేక రాశిచక్రాల వారికి ఏప్రిల్ నెలలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలుసుకుందాం..

మేష రాశి(Aries)
వీరికి ఏప్రిల్ నెల బాగా కలిసివస్తుంది. కోర్టు కేసుల నుంచి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఉద్యోగులకు ఆదాయంలో పెరుగుదల ఉండటంతోపాటు వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
వృషభ రాశి(Taurus)
కష్టపడి పనిచేసిన తర్వాతే విజయం, డబ్బు లభిస్తాయి. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లాభం బదులుగా నష్టం ఎదురయ్యే ప్రమాదముది. మాటతీరు, ప్రవర్తనపై నెల మొత్తం నియంత్రణ పాటించాలి.
మిధున రాశి(Gemini)
ఏప్రిల్ నెల ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులున్నాయి. దీనివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు నెల మధ్యలో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ ఉంటుంది. భూమి కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్త లేకపోతే అనారోగ్యం కలుగుతుంది.
కర్కాటక రాశి(Cancer)
ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి నెల ప్రారంభంలో ఫలితాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారికి ఈ సమయం మంచిది. కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. కార్యాలయాల్లో ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి(Leo)
ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఈ నెలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
కన్య రాశి(Virgo)
ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. సీనియర్ల సహాయంతో ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులున్నాయి. మహిళా ఉద్యోగులకు ఈ నెల కొంత కష్టంగా ఉంటుంది. కార్యాలయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.












Click it and Unblock the Notifications