26న కీలక పరిణామం.. ఈ రాశులకు అనుకోకుండా ధనయోగం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ జాతకస్తులకు మంచి ఫలితాలను అందజేస్తుంటాయి. వ్యక్తి జాతకంలో అంగారకుడు బలంగా ఉంటే విజయాలు ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల శ్రేయస్సు చేకూరడంతోపాటు మనిషికి సంపద పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ఈనెల 26వ తేదీన మిథునరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం బాగా కలిసివస్తుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
అంగారకుడి సంచారం వీరికి బాగా కలిసివస్తుంది. విదేశీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్నవారి కోరికలు నెరవేరతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ధైర్యం, శక్తి కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపించడంతోపాటు అన్నీ ధార్మిక కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బలపడి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. డబ్బులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడంవల్ల భవిష్యత్తులోను మేలు కలుగుతుంది.

సింహ రాశి
నిరుద్యోగులకు ఈ సమయంలోనే ఉద్యోగం లభిస్తుంది. పై అధికారులచేత మంచి గుర్తింపు లభించి ప్రమోషన్స్ పొందుతారు. అదే క్రమంలో వేతనం కూడా పెరుగుతుంది. అంగారకుడి సంచారం అనేది ఈ రాశివారికి ఒకరకంగా వరం అని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయడంతోపాటు ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన తర్వాత మరింత ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
కన్యా రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనుల్లోను విజయం చేకూరుతుంది. ఆర్థికంగా బలంగా మారతారు. పిల్లల తరఫున ఉన్న మీ బాధ్యతలు ఇప్పుడు నెరవేరతాయి. రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నవారికి ఇది చాలా మంచి సమయం. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటినుంచో విదేశాల్లో చదవాలని కోరుకుంటున్నవారి కోరికలన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications