గృహము లోపల మెట్లు ఏ దిక్కున నిర్మిస్తే మంచి జరుగుతుంది?

ఏ ముఖద్వార గృహమైనా కుడా గృహంలోపల, మరియు గృహానికి చుట్టు ప్రక్కలగల ఖాళీ ప్రదేశములలో వీలును బట్టి మెట్లుఏర్పరచవచ్చును.

గృహస్తులు తమ అవసరమునను సరించి గృహములో రెండు రకములైన మెట్లు నిర్మించు కొనవచ్చును.
ఇంటి వెలుపల భాగంలో మెట్లు ఈ మెట్లను గురించి మన పూర్వపు ఋషుల అభిప్రాయం ఈ విధముగా నున్నది.

ఇండ్లలోనివారు తమ అవసరముకి నాలుగు దిక్కులలోను మెట్లు నిర్మించుకొనవచ్చును. ఏ ముఖద్వార గృహమైనా కుడా గృహంలోపల, మరియు గృహానికి చుట్టు ప్రక్కలగల ఖాళీ ప్రదేశములలో వీలును బట్టి మెట్లుఏర్పరచవచ్చును.

astrologer directions to built stairs in house

1. మెట్లునేరుగాను, లేదా ఒకటి, రెండు, మూడు స్థలములలో వంకరగాను గుండ్రముగాను నిర్మించవచ్చును.
2. పూర్వపు ఋషులు సోపానాల యొక్క ఆకృతి గురించి ఎలాటి సూచనలు చేయలేదు. కావున గృహస్తులు తమకనుగుణముగా లేదా అలంకారమునకనువుగా తమకు తోచినటు ప్రవేశము ఎత్తులో యుండునటు నిర్మించుకొనవచ్చును.
3. ఉత్తర, దక్షిణ సింహద్వార గృహములకు ఇంటి వెలుపల, గోడనంటుకుని మెటు నిర్మింపదలచినచో తూర్పు ఈశాన్యములో తూర్పుగోడనంటుకుని ఉత్తరం నుండి దక్షిణానికి నేరుగా ఎక్కి మేడలోనికి ఎత్తులోగాని మధ్య భాగములోగాని ప్రవేసించవలెను.
4. గృహముయొక్క తూర్పు భాగములో మెట్లను కట్టవలెనన్న తూర్పు దిశకు కాంపౌండ్ గోడను తాకకుండ దక్షిణమువైపు ఎక్కి పడమరవైపు మలుపు తిరిగి పైకప్పకు మీదుగా వెళ్ళనటు నిర్మాణము చేయవలెను.
5. ఈశాన్యభాగములో మెట్ల నిర్మాణమునకు మొదలు ఫ్లోరింగ్ లెవెల్ సమముగా చతురస్రాకారముగా మూడు అడుగుల వేదికనిర్మించి దానిపైనుండి నేరుగా దక్షిణం వైపు ఎక్కులాగున సోపానములను నిర్మించవలెను.
6. ఏ రకమైన మెట్లను నిర్మించినను నడక ఎత్తుగా మాత్రముండవలెను.
7. ఎత్తుగా యుండవలెనన్న మెటు తూర్పు మరియు ఉత్తరపు గోడలకు అంటుకోని నిర్మించరాదు.
8. మెట్లునిర్మించునపుడు నేలమీదగాని, పైకప్పమీదగాని ఈశాన్యం తెగిపోకుండ, ఆగ్నేయం పెరగకుండు విధంగా మెట్లునిర్మించవలెను.
9. మెట్ల క్యాబిన్ కోసం ఆగ్నేయభాగములో పైకప్పను ముందుకు ప్రాజెక్టు చేయవలసి వచ్చినపుడు అంతే కొలతలతో ఈశాన్యంలో కూడ పైకప్పను ప్రాజెక్టు చేయవలెను.
10. గృహం లోపల మెట్లను నిర్మించినచో ఉత్తరం, తూర్పు వైపు గదులలో, దక్షిణ, పశ్చిమ వైపు గదులలో మెట్లను నిర్మించవచ్చును. ఈశాన్య గదిలో మెట్లను నిర్మించకూడదు.
12. దక్షిణ, పశ్చిమ గదులలో దక్షిణ పశ్చిమ గోడలకు అంటి తూర్పు, ఉత్తర గోడలకు అంటకుండ దక్షిణం, పశ్చిమం వైపు ఎక్కు విధముగా నిర్మించవలెను. మేడమీద నుండి మెట్ల వలన నడక ఎత్తుగా నుండునటుల మెట్లునిర్మించవలెను.
ఈ ఆధునిక యుగములో గృహ నిర్మాణ శాస్త్రజ్ఞులనేక రకములైన సోపానములను నిర్మాణముల యొక్క ప్రణాళికలను రూపొందించుచున్నారు. అందుకొన్ని శాస్ర సమ్మతముగాను, మరికొన్ని అసమ్మతముగాను ఉన్నవి. ఖాళీస్థలాలను అనుసరించి ఇంజనీయర్ మెటు నిర్మించుటకు సలహాలొసంగుచున్నారు. కానీ వీటి నిర్మాణములో గృహసులు తగు జాగ్రత్తతో వాస్తు ప్రకారము నిర్మాణము చేయించుకొనవలెను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+