లోకజ్ఞానం లేనిదే లక్ష్మీదేవి దయ దొరకదా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పుణ్య స్వరూపిణి లక్ష్మీకటాక్షం ఉంటే.. ఆడదానికి తినేరాత ఉంటే పెళ్ళయిన కొత్తలో మగడు సంపాదిస్తాడు. అదే పిల్లలకి తినేరాత ఉంటే పిల్లలు పట్టిన తర్వాత సంపాదిస్తాడు. అప్పడు కూడా సంపాదించలేకపోతే అసలు వానికే అనగా గృహ యజమానికే సుఖించే రాతలేదు.

కొత్త నిర్ణయాలను తీసుకోవద్దు
మీ ఊహల్లో కొత్త వెంచర్ అద్భుతంగా అనిపిస్తుంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా విజయమే. మీకెంత నమ్మకం వున్నా ఓసారి మీ భార్యతో సంప్రదించండి. అలాగే ఆ రంగానికి సంబంధించిన వారినయినా లేదా మీ హితులనయినా సంప్రదించండి.

astrologer tells about Goddess lakshmi kindness

అందులో సాధకబాధలు తెలుస్తాయి. తద్వారా మీ వెంచర్ మీరనుకున్నట్టు విజయాన్నీ ధనాన్నీ తెచ్చిపెడుతుంది. ధర్మరాజంతటి వాడు కూడా కొత్త కార్యాన్ని చేయాల్సి వచ్చినప్పడు తమ మంత్రి ధౌమ్యునికి చెప్పి చర్చించి ఆపై ప్రారంభించాడు.

అప్పు చెయ్యటం తప్పదు. కానీ ఆ అప్పు వడ్డీ వ్యాపారము చేసే వారి దగ్గర తీసుకుంటే మీరెప్పటికీ అందులోంచి బైటపడరు. స్నేహితుల దగ్గర, అయిన వారి దగ్గర తీసుకోవాలి. అలా వారి దగ్గర తీసుకోవాలంటే, వాళ్ళ ఇవ్వాలంటే మీ మీద నమ్మకం ఉండాలి.

మీకు ధనమివ్వటం వల్ల స్నేహం, బంధుత్వము చెడదు. తిరిగి మాట ప్రకారం ఇస్తారని గ్రహిస్తే మీకెంత ధనమైన తక్కువ వడ్డీకి దొరుకుతుంది. బంగారం పెట్టి అప్ప తీసుకుంటున్నారంటే, మీకు చాలా చోట్ల పరపతి లేనట్లే. నాలుగోవంతు వడ్డీ ఇస్తామని చెప్పినా భృగువంశ ధనికులు తమ రాజునే నమ్మలేదు. తీసుకున్న అప్పు ధనాన్ని ఉత్పత్తి చేయటం కోసం ఖర్చుపెట్టండి. మీ సుఖానికి ఖర్చు చేస్తే శ్రీ వేంకటేశ్వరునిలా కలియుగం అంతం వరకూ వడ్డీ కడుతూనే ఉండాలి.

ఉదాహరణకు కొంతమందిని తీసుకుందాం. ప్రస్తుత ఆస్తి జీరో, రమణ, రాజు, శంకర్, చంద్ర, రంగా వీరంతా రకరకాల సంస్థల్లో పనిచేస్తున్నారు. నెలకి పదివేలు సంపాదిస్తున్నారు. ఇక మరో ఉదాహరణగా సుబ్బారావు. ఆస్తి అయిదువందలు. చేసేపని ఆ అయిదువందల పెట్టుబడితో ఇంట్లో ఇడ్లీ దోశెలు చేసుకుని సైకిల్ మీద వ్యాపార రద్దీ ప్రదేశాల్లో అమ్మటం.

మీరు చెప్పండి. ఎప్పటికయినా శక్తిని పెట్టుబడిగా పెట్టి పదివేలు సంపాదిస్తున్నవాళ్ళు ధనవంతులవుతారా? లేక అయిదువందల పెట్టుబడితో మళ్ళీ ఆ పనిలో కూడా ఒకరికి పని ఇచ్చి, ఇడ్లీలు అమ్ముకునే సుబ్బారావు ధనవంతుడవుతాడా? మీరే ఆలోచించండి. శక్తిని నమ్మిన వాడా? తెలివిని నమ్మినవాడా? మొదటిదే అయితే ఈ పుస్తకం చదవటం, వినటం వేస్ట్, రెండోది నమ్మితే నేను మీకు చెప్పింది సుబ్బారావులా ఇడ్లీలను అమ్మమని కాదు.

చట్టబద్దంకానివి చెయ్యకండి

ఈజీగా మనీ సంపాదిద్దామని ఆ దారిలో వెళితే, మీరే కాదు మీ భార్యాపిల్లలూ, ఆ పై తరం వారు కూడా దరిద్రంలో బ్రతకవల్సి వస్తుంది. దానితోపాటు తేలికగా వచ్చే ధనం సుఖమివ్వదు. అహంకారాన్ని పెంచి పతనం చేస్తుంది. మీరు తెలిసీ తెలియక అలాంటి చట్ట వ్యతిరేక మార్గంలో వుంటే, అది తప్ప అని చెప్పిన వాళ్ళని గౌరవించి, ఆ పనులు మానండి. తప్పుడు పనులు మానలేదంటే సంపదలూ వైభోగాలూ పోతాయని మైత్రేయుడు చెప్పినా వినకుండా వ్యతిరేకించినందుకే రెండు తొడలు విరిగి యుద్ధరంగంలో కూలిపోతావని దుర్యోధనుడు శాపాన్ని పొందవల్సి వచ్చింది.

ఒక్కొక్కసారి అతిప్రేమ కూడా సంపదలనీ, సుఖాలనీ దూరం చేస్తుంది
ఈ అతిప్రేమ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఎప్పడూ కలసి ఉండాలి. కమర్షియల్ పరిచయాన్నే స్నేహమని భ్రమిస్తే, అవతల వారు మీ వీక్నెస్ని అడుపెట్టుకొని గొప్పవారవుతారు. ఎప్పడూ మిమ్మల్ని అదే పరిస్థితిలో ఉంచుతారు. పదిసంవత్సరాల క్రితం ఎక్కడున్నారో మీరక్కడే వుంటారు. కాని మీ నుంచి ప్రేమని పొందిన వారు మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్లారు. తర్వాత బోర్కొట్టి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు.

ఇక రెండోది ఆ అతిప్రేమతో మనం తానా అంటే తానా, తందానా అంటే తందానా అంటారు. దాని వల్ల మరింత ప్రమాదం. దుర్యోధనుడి మీద అతిప్రేమతోనే ధృతరాష్ట్రుడు తానా అంటే తానా, తందానా అంటే తందానా అని అన్నందుకు దుర్యోధనుడు సకల సంపదలనూ, సోదరులనూ, హితులనూ, గురువులనూ ఆఖరికి తనకి తానే పోగొట్టుకున్నాడు.

ఒక్కొక్కసారి వెనకడుగు కూడా వెయ్యాలి
మీరు ధనాన్నికోల్పోయారు. వ్యాపారంలో రహస్యాలూ బైటికెళ్ళి పోయాయి. పైగా మీ మీద అభియోగాలు. అసత్యప్రచారాలు. రూపాయి పుట్టకుండా చేస్తున్నారు. అలాంటప్పుడు ఆవేశపడకూడదు. ఆ కోపానికి లోనయితే మరింత నష్టపోవాల్సి వస్తుంది. సహనం నశింపచేయొదు. మళ్ళీ సమయం వస్తుంది. శ్రీకృష్ణార్జునులంతటి వాళ్ళు కురుక్షేత్రంలో ఈ రోజు వదు, రేపు చూద్దాం అని వెనక్కి వచ్చారు. వేటాడే ముందు సింహం కూడా వెనక్కి అడుగు వేస్తుంది. ఆలోచించి దుముకుతుంది. పై ఒక్కదానికే ఇది ఉదాహరణ కాదు. టైమ్ మనది కానప్పడు మౌనాన్నే ఆశ్రయించాలి. అలా కాకుంటే మరింత ధనం, విజయం పోగొట్టుకోవాల్సి వస్తుంది.

ధనమున్న మిత్రులతో జాగత్త
మీరు మంచి మిత్రులే కానీ మీకంటే ధనమున్నవారితో స్నేహం ఒక్కోసారి మీ ధనాన్ని పోగొడుతుంది. మీరు మామూలుగా ఎ.సి.లో ప్రయాణం చేస్తారు మీ ఆర్థిక స్తోమత ప్రకారం. అదే మీ మిత్రుడు ధనముంది కాబట్టి విమానంలో వెళతాడు. కలిసి వెళితే ఎంత ఖర్చు అదే కుటుంబంతో అయితే..ఎంత ధనం కోల్పోతారు. స్నేహమనుకుని అలా వారితో వెళితే చిల్లపడేది మీ సంపదకే డబ్బు సంపాదించటం కంటే కష్టమైన పని దాన్ని నిలబెట్టుకోవటం. స్టోమతకు తగ్గట్టు ప్రవర్తించటము. సుఖ వ్యసనాల్లోనే ధనవంతుడైన మిత్రుడు తోడు ఉంటాడు. ధనాధిపతి కుబేరుడి మిత్రుడు శివుడు. అయినా అవసరార్థం భిక్ష మెత్తక తప్పలేదు పరమేశ్వరుడికి, స్నేహితుడైన కుబేరుడు మిత్రుడు శివుడు కాశీలో బిచ్చమెత్తుతుంటే ఏం చేస్తున్నాడు.

ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారికెంత గలిగన
తనభాగ్యమె తనకుగాక తథ్యముసుమతీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Goddess Lakshmi kindness.
Please Wait while comments are loading...