Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముక్కు మీద పుట్టుమచ్చ అదృష్టమా ?: ఎక్కడుంటే ఏ ఫలితం?

ముక్కు లావుగా ఉన్నచో అధిక మాటకారి. భోళాభాతీతనం కలిగి ఉండును. సన్నటిముక్కు చిన్న నాసికారంధ్రాలు కల వారు, తెలివితేటలతో గుప్తముగా మాట్లాడుదురు. కాని వారి మాటలలో తెలివితేటలు గోప్యత జాగ్రత్త కనపడును.

హైదరాబాద్: ముక్కు లావుగా ఉన్నచో అధిక మాటకారి. భోళాభాతీతనం కలిగి ఉండును. సన్నటిముక్కు చిన్న నాసికారంధ్రాలు కల వారు, తెలివితేటలతో గుప్తముగా మాట్లాడుదురు. కాని వారి మాటలలో తెలివితేటలు గోప్యత జాగ్రత్త కనపడును.

ముక్కు చివర పుటుమచ్చ ఉన్నచో చురుకైన తెలివితేటలు, ఆలోచనాశక్తి ఎక్కువగా కలిగి ఉందురు. ఏ పనిచేసినా తొందరగా చేయుదురు. నిముషాలు విూద చేయును. కోపం అధికముగా ఉండును. తలచిన కార్యము పూర్తి అయ్యేవరకు పట్టుదలతో చేయుదురు. యితరులను లెక్కచేయరు. తనవారి నందరిని తనచెపచేతలలో అంటే తనమాట వినేటట్లుగా ఉంచు కొందురు.

astrologer tells about moles on nose

మొండిపటు ఎక్కువ. తప్పుని తప్పుగా రుజువు బుజువు చేయు వరకునిద్రపోరు. అభిమానం, ఆత్మగౌరవము తక్కువ, ఏపనిలో నైనా ప్రవేశించిన దానియందు ప్రావీణ్యత సంపాదింతురు. యితరుల గొప్పతనము గురించి ఎవరైనా చెప్పిన వారిని చులకన చేయుదురు. మాటకారితనము ఉండును. ధనధాన్యములు అభివృద్ధిగా ఉండును. స్థిరాస్థిని అభివృద్ధి చేయును. గర్విష్టి కావడం వల్ల అపుడపుడు యిబ్దందులకు గురి అయిననూ వాటి నుండి అవలీలగా బయటపడగల వారిరగుదురు.

ముక్కుకి కుడిభాగమున
ముక్కుకి కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే కష్టపడి పనిచేయు శక్తి సామర్థ్యములు కలిగి ఉందురు. చూస్తుండగానే ధనవంతుడు కాగల అవకాశము కలదు. కృషికి మించిన ఫలితమును పొందును. దూరదృష్టి కలిగి ఉందురు. మొదట సామాన్యవ్యక్తిగా మిక్కిలి అభివృద్ధిలోకి వచ్చును. ఏ పనిప్రారంభించినా మధ్యలో అదృష్టం కలిసివచ్చి పైకి వఛెదరు. సంపదకలిసి వచ్చిననూ ఎంతో కాలమునిలువక వద్ది పోయినట్లుగా పోవును. ముక్కుకి ఎడమభాగమున ముక్కుకి ఎడమ భాగమున పుట్టుమచ్ల ఉంటే మంచిదికాదు. పరస్త్రీల యందు ఆసక్తి ఎక్కువ. చేతిలో డబ్బు బజారు పాలై పోవును. ఆదాయము మించి ఇరులు చేయుదురు. భార్యతో సంతృప్తి చెందక పరస్త్రీ వ్యామోహములో పడెదరు. నీచమైన స్త్రీలతోను, తన అంతసుకు సరితూగని స్త్రీలతో సంబంధము కలిగిఉందురు. అపుడపుడు వారి వలన ధన సంపాదన కూడా చేయుదురు.

ముక్కుకి క్రింద భాగమున
ముక్కుకు క్రింద అడ్డకమ్మిపై పుట్టుమచ్చ ఉన్న మంచిది కాదు. ఏ పనియందు స్థిరత్వము ఉండదు. యితరుల బాధలను చూచి జాలిపర దురు. ధన విషయంలో యిబ్బందులు పడుచుందురు. దుబారా ఖర్చు ఎక్కువ. ఎంత ప్రయత్నించిననూ స్థిరఉద్యోగము దొరకక, సరియైన ఆదాయము లభించక బాధలకు గురిఅగుచుందురు. ఒడిదుడుకులతో జీవితము గడుపవలసివచ్చును. తన యొక్క అజాగ్రత్త వలన తనను నమ్ముకున్నవారిని చిక్కులలో పడే లాగును చేయుచుందురు.

ముక్కునకు మొదట
ముక్కునకు మొదట అనగా అడ్డ కమ్మి ప్రారంభములో మద్ద ఉన్నయెడల మంచిది. స్థిరాస్థిని సంపాదింతురు. చదువుకున్న వ్యక్తి అయిన ఉద్యోగప్రాప్తి ఉండును. వ్యాపార వ్యవహాము లందు ఆరితేరి ఉండును. ఏ పని ప్రారంభించినా అదృష్టము కలిసివచ్చును. చక్కనిభార్య మంచి సంతానము కలిగిఉందురు. సర్వసుఖాలు అనుభవించ గలరు. యింకా సుఖాలు అను భవించలేకపోయానన్న అశమిగులును. ముక్కుపుటల అడుగున ముక్కుపుటలకు అడుగు భాగమున పుట్టుమచ్చ ఉన్న చాలా మంచిది. వీరు ఎల్లప్పుడు అందముగాను, ఆకర్షణీయముగా కనిపించుటకు ప్రయత్నించుదురు. వీరు ఏభాషలోనైనా ప్రావీణ్యము సంపాదించిన దానిలో అనర్గళముగా మాట్లాడేశక్తి సామర్థ్యములు కలిగి ఉందురు. మంచి ఉద్యోగము, అనకూలమైన భార్యలభించును. వీరు ఆదర్శవంతమైన జీవితము గడుపుదురు. ముక్కు రంధ్రముల యందు పుట్టుమచ్చ ఉంటే మనస్థాపము, దుఃఖము కలుగును.

ముక్కుకు సమీపమున
ముక్కుకు సమిూపమున పుట్టుమచ్చ ఉంటే వ్యాపార, వ్యవహారము లందు ఆరితేరిఉండును. వ్యాపారంకలిసివచ్చును. స్థిరాస్థిని సంపాదింతురు. పరస్త్రీల యందు ఆసక్తిని కలిగిఉందురు.స్త్రీల విషయం లో డబ్మబాగుగా ఖర్చు చేయుదురు. పరిమళద్రవ్యములను వాడుచుందురు. విలాసవంతమైన జీవితముపై ఎక్కువ ఆశకలిగి ఉందురు. ఎదుటివార్థికి డాబుగాను,దర్ణముతోను కనిపించులాగున వ్యవహరింతురు. కుటుంబసంతానం అభివృద్ధి కలిగిఉండును. సంతానము, విద్య వినయవిధేయతలు కలిగి మంచి అభివృద్ధిలోకి వచ్చుదురు.

గడ్డం
గడ్డమునందు పుట్టుమచ్చ ఉన్న ధనాభ్యుదయము, గౌరవాతి శయములు కలుగును.

గడ్డానికి క్రిందభాగమున
గడ్డానికి క్రిందభాగమున పుటు మచ్చ ఉన్న సమయస్ఫూర్తి, మాటతారితనము,విజ్ఞాత యితరులకన్న ఎక్కువగా ఉండును. ఎదుటివారిని తనయొక్క తెలివితేటలతోను, మాటలనేర్షరితనముతోను వశపరచు కుందురు. సంగీతమనిన వీరికి యిష్టము. సంగీతముద్వారా ధనము, పేరు ప్రతిష్టలు సంపాదింతురు. సాహిత్యము నందు కూడా అనుభవము కలిగి ఉందురు.

కుడి ప్రక్కన
గడ్డమునకు కుడి ప్రక్కన పుటుమచ్చ ఉన్న చాలా మంచిది. మాటకారి తనము ఉండును. తన చెప్పిన దానిని ఎదుటివారిచేత అవునని ఒష్టించేంతటి తెలివితేటలు ఉండును. ఏ విషయమునైనా లాజికల్గా చెప్నను. ఈ పుట్టుమచ్చ లాయర్లకుగాని, రాజకీయ వేత్తలకు గాని ఉన్న మంచిపేరు, కీర్తి ప్రతిష్టలుసంపాదించి అభివృద్ధిలోనికి వస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+