మానవ జన్మకి అర్థం పరమార్ధం ఎంటో తెలుసా?

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మనది ప్రపంచంలో ఎవరు సాధించలేని గొప్ప సంస్కృతీ.. దీని విలువ ప్రస్తుతం దాదాపు ఎవరికీ తెలియదు. ఉదయం లేవడం, చదువు, విద్యలు, ఉద్యోగం, భార్య భర్త పిల్లలు సంసారం, సంఘంలో ఉన్నత స్థితి గురించి ఆలోచన చర్యడం, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావితం కావడం, వ్యసనాలకు లొంగిపోవడం వంటి వాటికి గురై ఉన్నత విలువలు కోల్పోయారు. కోల్పోతున్నారు. ఎంతసేపు నేను ఎదగాలి, హీరో కావాలి, గొప్పవాడు కావాలి అనే ఆశతో జీవితం అంతా అగ్నిచుట్టూ తిరిగి చివరికి అందులోనే పడి మరణించే శలభం లాగా అయిపోతున్నారు.

Astrologer told about value of human birth

ఈ శరీరంతో సాధించలేనిది ఏదీ లేదు. ఆ పరమాత్ముడికి ఉన్న శక్తులన్ని ఈ శరీరానికి ఉన్నాయి. కాకపోతే ప్రపంచ ప్రలోభాలకు లొంగి శరీర ఉనికిని కోల్పోతున్నాం. నిజానికి కావలసింది ఈ శరీరం పొందే సుఖ సంతోషాలు కాదు. అంతఃప్రయాణం చేయాలి. నిన్ను నీవు తెలుసుకోవాలి. అప్పుడే మానవజన్మకి అర్థం పరమార్ధం ఉంటుంది.

ఇలా చేయాలి అంటే అందరికీ సాధ్యం కాదు. ఎవరికి ఏది చేయాలనిపిస్తే అది పూర్తి సంకల్పంతో చేయాలి. ఆ చేసే పని తారస్థాయిలో చేయాలి. లేదంటే ప్రపంచం ముందుకి కదలదు. కొత్త పుంతలు తొక్కదు. ఇందులో భాగంగానే ఒకడు రైలు కనిపెట్టాడు. మరొకడు విమానం. మరొకడు అంతరిక్షంలో కి దూసుకెళ్లాడు. ఇలా ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయిలో నీ సంకల్పం ఉండాలి. అందుకే పూర్వం ఋషులు ఏమన్నారంటే!

తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు కాదు ఇవ్వవలసింది. తోడ్పాటు ఇవ్వాలి. మీ అభిప్రాయాలను మీ పిల్లలలపై రుద్దకండి. జన్మని ఇవ్వడం వరకే మీ వంతు. అతడి ఆలోచనలు భావాలు పరమాత్ముడి సంకల్పాలు. ఆ సంకల్పాలకు మీ తోడ్పాటు ఉండాలి తప్ప మీ కలలను పిల్లలపై రుద్దకండి. అని. మీరు ఏ చరిత్ర తీసుకున్నా ఎవరు ఏది సాధించినా అందులో తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటుందే తప్ప నువ్వు ఇది సాధించాలి అనే బలవంతపు చర్యలు ఉండవు. ఎందరో ఎన్నో సాధించి మన ముందు ఉంచారు కదా వాటిని చదవండి తెలుస్తుంది.

కనుక శరీరానికి కావలసినవి సమకూర్చుకోవడమే కాకుండా ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మీలో ఉందని గ్రహించండి. మీలోకి మీరు ప్రయాణం చేయండి.. మీసంకల్పం గట్టిదైతే ఆ పరమాత్ముడి అనుగ్రహం తప్పక ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+