వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: పదే పదే పీడ కలలు వస్తున్నాయా..! అయితే ఈ పని చేయండి..!

|
Google Oneindia TeluguNews

దాదాపు అందరికీ నిద్రలో కలలు వస్తుంటాయి. అయితే ఆ కలలు మంచివి ఉండొచ్చు.. చెడువి ఉండొచ్చు. మంచి కలలు వస్తే మంచిదే.. కానీ పీడ కలలు వస్తే.. అవును పీడ కలలు వస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పీడ కలలు మనల్సి ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. ఇవి కొన్ని సార్లు ఆత్మహత్యలకు కూడా ప్రేరేపించే అవకాశం ఉంది.

దెయ్యాలు

దెయ్యాలు

ఈ పీడ కలలకు మనం నిజ జీవితంలో చూసినవై ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలకు సంబంధించిన సినిమాలు చూసినప్పుడు అందులోని కొన్ని దృశ్యాలు మన మెదడులో రికార్డవుతాయి. మనం నిద్రిస్తున్నప్పుడు అవి రివైన్ అవుతాయి. అయితే ఆ దృశ్యాల్లో మనం కూడా ఉన్నట్లు కలలు వస్తాయి. దీంతో మనం భయాందోళనకు గురవుతాం. అందుకే మనం కొన్ని భయంకరమైన సినిమాలు చూడకపోవడమే మంచిది. ఒకవేళ చూసినా.. దృశ్యాలను సినిమా హాల్లోనే వదిలేయడం మంచిదని చెబుతున్నారు.

దేవుడికి మొక్కడం

దేవుడికి మొక్కడం

అయితే పీడ కలలు రాకుండా ఉండాలంటే నిద్రించే ముందు దేవుడికి మొక్కడం, లేదా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం లాంటివి చేస్తే ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అయినే కూడా పదే పదే పీడ కలలు వస్తుంటే.. నివారణ పూజలు చేయడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా మందికి ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, దెయ్యాలు మీదపడి హింసిస్తున్నట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జట్టు, పళ్లు రాలిపోవడం, మరణించినట్లు, పాము కాటేసినట్లు కలలు వస్తాయి.

పాము కనిపిస్తే

పాము కనిపిస్తే

ఇలాంటి కలలకు వస్తే చెడుకు సంకేతమని చెబుతున్నారు. భవిష్యత్ లో చెడు జరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. కొన్న మంచి కలలు కూడా వస్తాయి. కలలో తెల్ల రంగు పాము కనిపిస్తే మీరు త్వరలో ఓ గొప్ప ఘనత సాధించబోతున్నారని సంకేతమట. నెమలి నృత్యం చేస్తున్నట్లు మీకు కల వస్తే త్వరలోనే ఓ శుభవార్త వినే అవకాశం ఉందట. కలలో నూనె ఒలికిపోయినట్టు కనిపిస్తే కీడు జరిగే అవకాశం ఉంటుందట.

English summary
Almost everyone has dreams during sleep. But those dreams can be good and bad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X