Astrology: కలలో పాములు పదే పదే కనిపిస్తున్నాయా.. అలా ఎందుకంటే..!
పాములు కలలో కనిపస్తే దేనికి సంకేతమంటే..
కలలు రావడం సహజం. కానీ కలలు అందరికీ ఒకేలా రావు. చాలా మందికి కలలో చాలా కనిపిస్తాయి. అయితే కలలో పాములు కనిపిస్తే ఏం చేయాలో జ్యోతిష్యులు వివరించారు. కలలో పాములు కనిపించడానికి రాహు, కేతు దశలు లేకుంటే రాహు బుద్ధి, కేతు బుద్ధి కాలంగా వుంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని బట్టి పాము కలలో కనిపించేందుకు.. జ్యోతిష్యానికి తప్పక లింకుందని వారు వివరిస్తున్నారు.

రాహు-కేతు
పాములు కలలో వస్తే ఒకంతకు మంచిదేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాహు-కేతు గ్రహాలకు పరిహారం చేసేందుకే పాములు అలా కలలో కనిపిస్తాయని వివరిస్తున్నారు. నిద్రలో పాములు కనిపిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వారి జాతకంలో కాలసర్ప దోషం లేదా రాహు-కేతు దశ నడుస్తున్నట్లు అర్థం.
ఇలాంటి వారికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాముల గుంపు కనిస్తే అలాంటి కల అశుభకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే జీవితంలో కష్టాలు ఎదురుకానున్నాయని సంకేతమట.

నాగుపాము
నాగుపామును కలలో వస్తే విరోధులతో ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. రెండు తలలతో కూడిన నాగుపాము కలలో కనిపిస్తే.. మంచి ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. పామును చంపేస్తున్నట్లు కలగంటే.. శత్రుబాధలు తొలగిపోతాయి. నాగుపాము కరిచినట్లు కలవస్తే ధనలాభం ఉంటుందట. పాము తరుముతున్నట్లు కలగంటే.. దారిద్ర్యం తప్పదని చెబుతున్నారు.

శని
పాము కాలికి చుట్టుకున్నట్లు కలవస్తే.. శని పట్టిపీడించబోతున్నాడని గ్రహించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పాము కరిచి రక్తం వచ్చినట్లు కలగంటే.. పట్టిన శని వీడుచున్నట్లు గుర్తించాలి. పాము గొంతుకు చుట్టినట్లు కలగంటే.. ఆస్తిపరులు అవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కలలో పామును చంపుతున్నట్లు కనిపిస్తే అలాంటి కల శుభప్రదమట. మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని సంకేతమట.


Click it and Unblock the Notifications