పురుష ధర్మం అంటే ఏంటీ ? ఎలా అచరించాలి ?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు.
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ధర
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

astrology: ethics of mens

1.కార్యేషు యోగీ :-
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి

2. కరణేషు దక్షః :-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయాతు రామః:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః-
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+