మార్చి 11 నుంచి గురువు దయతో ఈ రాశులు మంచి సంపాదనపరులవుతున్నారు
మార్చి 11వ తేదీన దేవతల గురువైన బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తోంది. తిరోగమన సంచారం నుంచి సక్రమ దిశలోకి రావడంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బృహస్పతి అంటే జ్ఞానానికి కారకుడు. సంపదను, వివాహాన్ని, పిల్లలను ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మికతవైపు జీవితాన్ని నడిపిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుడి నడిపిస్తాడు. ఈ పరిణామంతో కొన్ని రాశులవారు మాత్రం విపరీతంగా లాభపడుతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి
కష్టపడి పనిచేయడంవల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి కలిసివస్తాయి. అంతేకాకుండా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో దూర ప్రయాణాలు చేస్తారు.

మీన రాశి
మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. విశేషమైన ప్రయోజనాలు పొందడానికి ఇది వీరికి చాలా అనువైన సమయం. చదువులో విద్యార్థులు బాగా రాణిస్తారు. జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
మేషరాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి మంచి ఆదాయం సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా మారతాయి.
వృషభ రాశి
పెళ్లి పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. మంచి అవకాశాలు కూడా వస్తాయి. విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తారు.
కన్యా రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. మానవ సంబంధాలు చాలా మెరుగు పడతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. శారీరకంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.












Click it and Unblock the Notifications