వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: 2017లో తెలుగు రాష్ట్రాల గ్రహస్థితి ఇలా...

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2017లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్కుడు వివరించారు. చదివి చూడండి...

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వవైద్యశాలలయందు అనారోగ్య ఎక్కువగా ఉండును. రాష్ట్రంలో మంత్రివర్గ మార్పులు జరుగుతాయి. మంచి నాయకుని కోల్పోయే అవకాశము ఉన్నది. ప్రయివేటు సంస్థలు ప్రజలనుండి విపరీత ధనమును దోచుకొందురు. విద్యావ్యవస్థలో గొప్పమార్పులు జరుగుతాయి. మీడియా రంగమునందు చేసిన తప్పులు కప్పి పుచ్చుకొందురు. గతంలో తలపెట్టిన ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలముచేయలేవు.

సినీరంగమునందు కుదేలయే సూచనలు కలవు. ప్రభుత్వ పధకములు ప్రజలకు అందుబాటులోనికి వచ్చుట కష్టము. ఇతరదేశముల యందు ప్రమాద సూచనలు ఎక్కువగా కలవు. మతపరమైన దాడులు, మతమార్పిడులు ఎప్పటిలాగే ఎక్కువగా జరుగుతాయి.

గ్యాస్, విద్యుత్ సరఫరాలో సంక్షోభేము ఎక్కువవుతుంది. చిన్నతరహా, చేతి పరిశ్రమల వారికి సహాయము ఎక్కువగా అందుతుంది. ప్రజల నెత్తిన వడ్డీ భారము మరింత పెరుగుతుంది. పేపరు ధరలు తగ్గుముఖం పట్టును. బంగారము ధర కాస్త పెరుగును. సాధువులు, సన్యాసులు, మరాధిపతులు, పీఠాధిపతులు వ్యక్తిగత భేధాభిప్రాయాలతో పోట్లాడుకుంటారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాగ్రహం

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాగ్రహం

రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిరంగా ఉన్నప్పటికిని పరిపాలకులకు, అధికారులకు అంతర్గతమైనటువంటి పరస్పర విభేదాలు, ఆధిపత్య ధోరణులతో ప్రజోపయోగ పథకాలు నత్తనడకగా సాగి ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. తరచు అకాల విపత్తులతో, ఊహించని ప్రమాదాలతో సామాన్య ప్రజానీకం ఇక్కట్ల పాలయ్యే సూచనలు ఉన్నాయి. ద్వితీయ స్థానమును పరిశీలించగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగు. కాని, వృధావ్యయము ఎక్కువయి ప్రజలకు సకాలంలో ఆర్థిక ప్రయోజనాలు అందే విషయంలో అసంతృప్తి ఏర్పడుతుంది.

బ్యాంకింగ్ రంగంపై ప్రభావం

బ్యాంకింగ్ రంగంపై ప్రభావం

కుటుంబ వైఫల్యాలతో బ్యాంకింగ్ రంగము కొంత కుదేలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తృతీయస్థానమును రాష్ట్ర రవాణారంగము పలు ఆకర్షణీయ ప్రజోపయోగ పథకాలతో ప్రజల మన్ననలందుకుంటుంది. అలాగే పత్రికా, సమాచార రంగాలలో వినూత్నమైన విప్లవాత్మక సంస్కరణ లతో కూడిన మార్పులు పెరిగినప్పటికిని ప్రతిభకు తగిన ప్రోత్సాహము |మాత్రము కరువవుతుంది.

అభివృద్ధి దిశలో రియల్ ఎస్టేట్

అభివృద్ధి దిశలో రియల్ ఎస్టేట్

చతుర్థస్థానమును పరిశీలించగా రియల్ ఎస్టేటు రంగాలలో కొంత వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికిని అభివృద్ధికరమైన పరిణామములు గోచరించుచున్నవి. వ్యవసాయరంగములో ప్రకృతి బాధలు, ఈతిబాధలు పెరిగి పంటలు కొంత తగ్గటం, ప్రభుత్వపు ప్రోత్సాహం తక్కువగా ఉండటం, రైతులకు గిట్టుబాటు ధర విషయమున గోటిచుట్టపై రోకలిపోటు వలె కనిపించుచున్నది.

విద్యార్థులకు గుర్తింపు లేని విజయాలు..

విద్యార్థులకు గుర్తింపు లేని విజయాలు..

విద్యారంగంలో కూడా విద్యార్థులు గుర్తింపులేని విజయాలను సాధించినప్పటికిని, వారికి అభివృద్ధి బాగానే ఉంటుంది. పంచమ స్థానమును పరిశీలించగా శిశుసంక్షేమం, సంగీత, సాహిత్య పరిశోధనా రంగాలకు ప్రభుత్వ ప్రోత్సాహం గతంకంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. షష్ణస్థానాన్ని పరిశీలించగా అన్ని రంగాలలోను అనారోగ్య కరమైన పోటీ ఎక్కువ, నిజమైన అభివృద్ధి తక్కువగాను ఉంటుంది. రాష్ట్రంలో అంటువ్యాధులు బాగా ప్రబలి ప్రజలకు ఆరోగ్య విషయంలో ఆందోళన ఎక్కువ అవుతుంది.

రాష్ట్రాలకు కేంద్రంతో సత్సంబంధాలు

రాష్ట్రాలకు కేంద్రంతో సత్సంబంధాలు

ప్రజారక్షణ విషయంలో ప్రభుత్వం సమర్థవంతముగా వ్యవహరించి ప్రజల మన్నను చూడగొంటుంది. సప్తమ స్థానమును పరిశీలించగా రాష్ట్రం కేంద్రమతో సత్సంబంధాలు కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ ప్రభుత్వాలకు అండగా ఉంటుంది. రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు కొంత అభివృద్ధి పధంలోనే కొనసాగుతాయి. విదేశములతో అనుకూల సంబంధములు పెరుగును.

ఆదర్శ వివాహాల వ్యవస్థ బలహీనపడుతుంది

ఆదర్శ వివాహాల వ్యవస్థ బలహీనపడుతుంది

రాష్ట్రాల్లో ఆదర్శ వివాహ వ్యవస్థలు కొంత బలహీనపడటం, ప్రేమ వివాహాలు పెరగటం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత తగ్గడం, విడాకులు ఎక్కువగుట వంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమస్థానమును పరిశీలించగా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనారోగ్య మూలకంగా మరణాలు పెరిగే అవకాశం ఉన్నది. అక్కడక్కడ కరువు కాటకాలు పెరుగుట, ఆర్థిక మోసాలు ఎక్కువ అవడం సామాన్యజనజీవనానికి విఘాతంగా పరిణమిస్తాయి. నవమ స్థానమును పరిశీలించగా మత సంబంధ విషయాలలో స్నేహపూర్వకమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సమాజంలో ఇటు ప్రజలలోను అటు పాలకులలోను ఆధ్మాత్మికత పెరిగి కొంత ధర్మానికి కట్టుబడి ఉండే లక్షణములున్నాయి.

English summary
Astrologer gives the predictions for two Telugu states, Telangana and Andhra Pradesh for the year 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X