పవన్ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్.. నో పర్మిషన్

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ' కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన సభకు అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా ఈ మేరకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే విషయంపై జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టడం లేదని.. కేవలం సమావేశం మాత్రమే నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా తమ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామని తెలిపారు.

PawanKalyan Huge Hyderabad Political Meeting Denied Police PermissionJSP Cadre Outraged PawanKalyan

మరోవైపు జనసేన సభకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని లీగల్ గా గెలిచి సభను ఏర్పాటు చేసుకుంటామని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే సభను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+