రేపటి నుంచి మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు రాశులకు ఆకస్మిక ధనయోగం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన, అరుదైన యోగాలను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన సంఘటన మే 18వ తేదీ నుంచి ఆవిష్కృతం కాబోతోంది. నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడైన గురు గ్రహం, సంపదలకు అధిపతి శుక్ర గ్రహం.. రెండూ మిథున రాశిలో కలుసుకుంటున్నాయి. గురు-శుక్రుల కలయిక కారణంగా శక్తివంతమైన "ధనలక్ష్మి రాజయోగం" ప్రారంభం కానుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో కొన్ని రాశుల వారు కుబేరులుగా మారతారు. వారిగురించి తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈ రాజయోగం మంచి విజయాలను తెచ్చిపెట్టబోతోంది. ఉద్యోగ రంగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల మద్దతుతో ఆఫీసు పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఈ వారంలో ఆదాయ వనరులు ఊహించని విధంగా పెరుగుతాయి. చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మనసుకు నచ్చిన విలాసవంతమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో నెలకొన్న విభేదాలు తొలగిపోయి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని రంగాలలో లాభదాయకంగా మారబోతోంది. మీ మనస్సులో సుదీర్ఘకాలంగా ఉన్న కోరికలు, కలలు ఈ వారంలో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలోనే వృత్తి లేదా వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణాలు లేదా విదేశీ పర్యటనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రయాణాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. నిలిచిపోయిన పనులన్నింటినీ పట్టుదలగా, సకాలంలో పూర్తి చేసి విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో మీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. మిమ్మల్ని చూసి తోటివారు అసూయపడతారు.
తులారాశి
తులారాశి వారికి ఈ యోగం వల్ల పట్టిందల్లా బంగారమే కానుంది. చిక్కుముడులన్నీ వీడిపోయే సమయం ఇది. వృత్తిపరంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ చాలా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్న దీర్ఘకాలిక వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎక్కడో చిక్కుకుపోయిన మీ సొంత డబ్బు, మొండి బాకీలు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారిని అదృష్ట లక్ష్మి ప్రత్యేకంగా కరుణించబోతోంది. ప్రభుత్వ రంగాల నుంచి భారీ ప్రయోజనాలు అందనున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి వారం ప్రారంభంలోనే శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన పనులు క్లియర్ అవుతాయి.మీ పనితీరుకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి, అధికారుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు ఈ రాజయోగ ప్రభావంతో పూర్తిగా తొలగిపోతాయి.














Click it and Unblock the Notifications