ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది
ఈ నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ప్రత్యేకంగా సంచారం చేస్తాడు. అందులోను చాలాకాలం తర్వాత మిథునరాశిలోకి రానుండటంతో కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి. దేవతల గురువైన గురుడు జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యం చేరుకునేందుకు సాయం చేస్తాడు. మిథునరాశిలో గురుడు జరిపే కదలికలవల్ల ఏయే రాశులు ప్రభావితమవుతున్నాయి? దీనివల్ల వారికి ఏం జరగబోతోంది? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
మిథున రాశి
కుటుంబంలో మంచి సంబంధాలు కొనసాగుతాయి. గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టివుంటే వాటి నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. జీవితంలో ఇంతవరకు చూడని ఆనందాన్ని చవిచూస్తారు. అదనపు ఆదాయానికి కొత్తగా వనరులు దొరుకుతాయి. గురువు దయతో ఆదాయం బాగా పెరుగుతుంది. శివాలయంలో, ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి. గురువారం బృహస్పతిని శనగలతో పూజించండి.

సింహరాశి
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకునే సామర్థ్యం సొంతమవుతుంది. మంచి లాభాలున్నాయి. కార్యాలయంలో ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును పూజించడంద్వారా అనుకున్న ఫలితాలను పొందుతారు.
మేషరాశి
కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి. బృహస్పతికి, మీకు నచ్చిన గురువుకు, సద్గురువుకు నానబెట్టి, ఉడకబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టండి. ఏమీ కోరుకోవద్దు.












Click it and Unblock the Notifications