మార్చి నెలలో ఈ రాశులకు రాజభోగం

మార్చి నెలలో గ్రహాల పరంగా కీలక సంయోగాలు చోటుచేసుకోబోతున్నాయి. 2వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలోకి, దేవతల గురువైన బృహస్పతి 11వ తేదీన గమన మార్పు, 14వ తేదీన కుంభరాశిలోకి బుధుడు, 15వ తేదీన మీనరాశిలోకి సూర్యుడు ప్రవేశించనుండటంతోపాటు 21వ తేదీ నుంచి బుధుడు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభించనున్నాడు. ఈ పరిణామాలన్నీ కలిసి కొన్ని రాశులపై మోయలేనంత అదృష్టాన్ని కల్పిస్తున్నాయి. ఏయే రాశులకు ఎలా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి

వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి. జీవితంలో కొత్త శిఖరాలకు చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సూర్యుడి అనుగ్రహం వీరిపై అపారంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు.

Astrology These zodiac signs will have a royal feast in the month of March due to planets transit

తులా రాశి

కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికి మీకు కావల్సినంత ఆదాయం సమకూరుతుంది. శారీరకంగా బాగుంటారు. మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. చాలా పరిణతిని ప్రదర్శిస్తారు. వృత్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

మిథున రాశి

ఇంట్లో శుభకార్యం ఉంది. కుటుంబంలో మంచి ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. వ్యాపార ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఉద్యోగాలు వస్తాయి. వృత్తి పరంగా మీరు ఆశించిన మార్పు చోటుచేసుకుంటుంది. అంతా సానుకూల పరిణామాలే ఉంటాయి.

ధనుస్సు రాశి

తోటి ఉద్యోగుల నుంచి మద్దతు అందుతుంది. కెరీర్ పరంగా చాలా ముందుకు పయనిస్తారు. పనిలో ఉన్న సవాళ్లను చాలా తేలికగా అధిగమిస్తారు. వ్యాపారంలో మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. గురువు అనుగ్రహం ఈ రాశివారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు చాలా బలపడతారు. మీ జీవనయానంలో అనేక మార్పులు తెస్తుంది.

వృషభ రాశి

ఈ రాశులవారు కఠినమైన సవాళ్లను కూడా చాలా సులభంగా ఎదుర్కుంటారు. విజేతలవుతారు. కెరీర్ పరంగా వీరికి కొత్తగా అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. ఆర్థికంగా మీ పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. పెద్దల నుంచి ఆస్తి కలిసిరానుంది. వృత్తి జీవితంలో మాత్రం చాలా కీలక మార్పు చోటుచేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+