ఈ నెలలోనే ధనశక్తి రాజయోగం.. ఈ రాశులకు సంపద కలిసివస్తుంది
గ్రహాలు నిరంతరం తమ రాశులను మార్చుకుంటూ సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను కూడా ఏర్పరుస్తుంటాయి. ఈ నెలలో కుజుడు, శుక్రుడు కుంభరాశిలో ధనశక్తి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ రాశిలో ఈ రెండు గ్రహాలు ఈ నెల 23న సంయోగం చెందడమే దీనికి కారణం. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశులకే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ఏయే రాశులకు అలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కలిసివస్తాయి. మంచి ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు అందుతుంది. కొత్త ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నవారు ఇప్పుడు చేయవచ్చు. ఇది మంచి సమయం. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

వృశ్చిక రాశి
పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. కెరీర్ పరంగా బాగుంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడి మీ జీవితాన్ని మలుపుతిప్పుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, వైద్య రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కొత్తగా పనులు ప్రారంభించాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అనువైన సమయం. రుణ సమస్యల నుంచి బయటపడతారు.
మకర రాశి
కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నవారికి ఇది చాలా అనువైన సమయం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినవారు మంచి లాభాలను అందుకుంటారు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కోరికలన్నీ తీరతాయి. ఆకస్మిక ధనలాభం ఈ రాశివారికి ఉంది. కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని, అలాగే వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. కార్యాలయంలో ఉద్యోగులపై పై అధికారులకు పూర్తి విశ్వాసం కుదురుతుంది.












Click it and Unblock the Notifications