ఈనెల మొత్తం ఈ రాశులు నక్కతోక తొక్కినట్లే
ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఆగస్టు ఐదోతేదీన ప్రారంభం కాబోతోంది. దానికి ఐదురోజులు ముందుగా ఆగస్టు నెల ప్రారంభమైంది. ఈ నెలలో కొన్ని శుభ యోగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. జులై నెలకన్నా అధిక ప్రాధాన్యత ఆగస్టులోనే ఉంటుందని, శక్తివంతమైన రాజయోగాల వల్ల కొన్ని రాశులవారికి అంతా అదృష్టమే పట్టుకుంటుందని చెప్పారు. ఈనెల ఈ రాశులవారికి వరమని చెప్పొచ్చు అంటున్నారు. ఈ యోగాలవల్ల ఏ రాశులవారు ఎన్నివిధాలుగా ప్రయోజనాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వేతనాలు పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం సిరుల వర్షం కురిపిస్తుంది. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాన్ని లేదంటే భూములను కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితంలో ఎంతో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది.

కర్కాటక రాశి
మంచి లాభాలను ఆగస్టు నెలలో పొందుతారు. గొంతు సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాయామాలు చేయడం అలవరుచుకోవాలి.
మిధున రాశి
కమ్యూనికేషన్ల రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల కోసం చూస్తున్నవారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. వారికి ఆర్థికంగా కలిసివస్తుంది. ఎదుటివారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటారు.
మేషరాశి
ఉద్యోగాలు చేసేవారు వారి వారి కార్యాలయాల్లో తమ పనితీరును మార్చుకుంటారు. దీనివల్ల మంచి పేరును సాధించుకుంటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల మేష రాశివారికి ఆసక్తి కలుగుతుంది. సాధ్యమైనంతగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. సమాజంలో గౌరమ మర్యాదలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరగడంతోపాటు గొప్ప పేరును సంపాదిస్తారు.












Click it and Unblock the Notifications