weekly horoscope: లక్ష్మీదేవిని దర్శించాలి.. ఆర్థికంగా బలపడతారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిఫలాలకు నక్షత్రాల గమనం ఆధారంగా నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈ వారం ఏ రాశివారికి బాగుంటుంది? ఏ రాశివారికి కలిసివస్తుంది? ఇంటా, బయట ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలమేనా? ఇబ్బందులేమైనా ఉన్నాయా? తదితరాలను రాశిచక్రాలను ఆధారంగా చేసుకొని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తులారాశి: ఆర్థికంగా బలోపేతమవుతారు. మీవల్ల కొందరికి మేలు కలుగుతుంది. వ్యాపారంలో ధనలాభం కనపడుతోంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలవల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ద్వాదశంలో కుజుడు ఉండటంవల్ల రుణ సమస్యలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించడంవల్ల శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: కాలం అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలే దక్కుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. భూమి, వాహన యోగాలున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పెద్దవారిని మెప్పిస్తారు. దీనివల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. లక్ష్మీదేవిని దర్శిస్తే మంచి జరుగుతుంది.
ధనుస్సు రాశి: కాలం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కృషిలో లోపం లేకుండా ఫలితాలు పొందాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని అమలు చేయడంలోను అంతే ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఏదైనా పని ప్రారంభించిన తర్వాత నిర్ణయాలను మార్చుకోకూడదు. ఆర్థికంగా పటిష్టమవుతారు. వ్యాపారంలో ఇబ్బంది పెట్టేవారున్నారు. సూర్యనారాయణుడి దర్శనం శుభప్రదంగా మారుతుంది.
మకర రాశి: కొత్త పనులను ప్రారంభించొద్దు. ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. ధైర్యంగా ఉండటంవల్లే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వొద్దు. వ్యాపారం బాగుంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల అనుకున్నది సాధిస్తారు.
కుంభరాశి:పనులు సకాలంలో ప్రారంభించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. వెనకడుగు వేయవద్దు.. లక్ష్యం చేరేవరకు కృషిచేస్తుండాలి. చంచల నిర్ణయాలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మధ్యలో పనులన్ని ఆపకూడదు. నవగ్రహ శ్లోకాలు పఠించడంవల్ల విజయాన్ని సాధిస్తారు.
మీన రాశి: ఎటువైపు చూసినా అంతా శుభమే కనపడుతోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదృష్టయోగాన్ని అంది పుచ్చుకోవాలి. వ్యాపారంలో లాభాలున్నాయి. ఇప్పుడు చేసే పనులు మీకు బంగారు భవిష్యత్తును ఏర్పరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. లక్ష్మీదేవిని స్మరించడంవల్ల ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు.












Click it and Unblock the Notifications